AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 8:06 PM

Share

కార్తి, పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘సర్దార్‌’కు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ సిద్ధమైంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఎస్‌జే సూర్య విలన్‌గా ఆకట్టుకోనున్నారు. కార్తీ-సూర్య ఫేస్‌ఆఫ్‌, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, మాళవిక మోహనన్‌ యాక్షన్‌ అవతార్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ స్పై థ్రిల్లర్‌ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్‌. సినిమాను పూర్తిగా సీక్వెల్‌లా కాకుండా, కొంత ప్రీక్వెల్‌, కొంత సీక్వెల్‌గా డిజైన్ చేశారు. ఏజెంట్ బోస్‌ గతంలో ఏం జరిగింది అన్నది భారీ స్కేల్‌లో చూపించబోతున్నారు. అదే సమయంలో ప్రజెంట్ టైమ్‌ లైన్స్‌కు కథను కనెక్ట్ చేశారు. తొలి భాగంలో డ్యూయల్‌ రోల్‌లో నటించిన కార్తి, సీక్వెల్‌లోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు మరో హైలైల్‌ విలన్‌ ఎస్‌జే సూర్య. ఆయన పెర్ఫామెన్స్ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళుతుందన్న నమ్మకంతో ఉంది మూవీ టీమ్‌. ముఖ్యంగా కార్తీ వర్సెస్‌ సూర్య ఫేస్‌ ఆఫ్ సీన్స్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్‌. తొలి భాగంలో హీరోయిన్స్‌ రోల్స్‌ గ్లామర్‌కే పరిమితమైనా సీక్వెల్‌లో మాత్రం యాక్షన్‌ సీన్స్‌లోనూ భాగం చేశారు. యాక్షన్ అవతార్ లో మాళవిక మోహనన్ సర్ప్రైజ్ చేస్తుండగా, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో నేటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 10 తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో, పార్ట్ 2 పై న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్‌ తరువాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింతగా పెరిగిపోయాయి. ప్రజెంట్ బిగ్ స్క్రీన్ మీద స్పై థ్రిల్లర్‌లు మంచి సక్సెస్‌లు సాధిస్తుండటంతో సర్ధార్‌ 2 కూడా అదే లిస్ట్‌లో జాయిన్ అవుతుందన్న నమ్మకంతో ఉంది మూవీ టీమ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!

Follow Us