మూడ్ ఆఫ్ ది నేషన్‏లో రష్మిక సెన్సేషన్.. దేశంలోనే నంబర్ వన్..

Rajitha Chanti

Pic credit - Instagram

04 September 2026

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ 'ఇండియా టుడే' నిర్వహించిన ప్రతిష్టాత్మక 'మూడ్ ఆఫ్ ది నేషన్' తాజా సర్వేలో నేషనల్ క్రష్ రష్మిక మందానా సరికొత్త రికార్డు సృష్టించారు.

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీపికను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానంలో నిలిచారు.

 గత నాలుగేళ్లుగా ఈ జాబితాలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం.

ఈ సర్వేలో రష్మిక తర్వాతి స్థానాల్లో అలియా భట్, శ్రద్ధా కపూర్, సాయిపల్లవి నిలిచారు. సినీ ప్రియులు, యువత పెద్ద ఎత్తున రష్మికకే ఓటు వేయడంతో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.

కన్నడ చిత్రపరిశ్రమ నుంచి ప్రయాణం ప్రారంభించిన రష్మిక, 'గీత గోవిందం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆల్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప' ఫ్రాంచైజీతో మెప్పించారు. 

హిందీలో రణబీర్ కపూర్‌తో నటించిన 'యానిమల్', విక్కీ కౌశల్‌తో చేసిన 'ఛావా' చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు ఈ అమ్మడు.

పెళ్లి తర్వాత తెలుగువారి కోడలిగా మారిన రష్మిక, భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రణబాలి' అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మైసా' నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న రష్మిక స్టార్‌డమ్ ఈ సర్వే ఫలితంతో మరో స్థాయికి చేరింది.