AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒక్కసారిగా గుప్పుమన్న గంజాయి వాసన.. మ్యాచ్ ఆపేసిన సబలెంకా..!

Aryna Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2026లో కమిల్లా రఖిమోవాతో మ్యాచ్‌ సందర్భంగా కోర్టు పరిసరాల నుంచి గంజాయి వాసన వస్తోందంటూ సబలెంకా అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడినా, సబలెంకా 6–3, 6–4తో విజయం సాధించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది.

Video: ఒక్కసారిగా గుప్పుమన్న గంజాయి వాసన.. మ్యాచ్ ఆపేసిన సబలెంకా..!
Aryna Sabalenka
Venkata Chari
|

Updated on: Sep 05, 2026 | 12:18 PM

Share

Aryna Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2026లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్యనా సబలెంకాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో మూడో రౌండ్‌లో తలపడుతున్న సమయంలో కోర్టు పరిసరాల నుంచి గంజాయి వాసన వస్తోందంటూ సబలెంకా అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. సబలెంకా 3–0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సర్వీస్ చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు వాసన బలంగా వస్తోందని చెప్పడంతో మ్యాచ్‌ కాసేపు నిలిచింది. అనంతరం ఆట తిరిగి కొనసాగింది. ఈ ఘటన జరిగినప్పటికీ సబలెంకా మ్యాచ్‌ను 6–3, 6–4తో గెలిచి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.

సబలెంకా ఏమందంటే..?

మ్యాచ్‌ అనంతరం కూడా సబలెంకా ఈ విషయంపై మాట్లాడుతూ..

  • ఇతరులు తమకు నచ్చిన విధంగా సరదాగా ఉండడం తనకు అభ్యంతరం లేదని, అయితే టెన్నిస్‌ కోర్టుకు సమీపంలో అలాంటి వాసన రాకుండా ఉంటే మంచిదని పేర్కొంది.
  • అత్యున్నత స్థాయిలో మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఆ వాసన ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది.

యూఎస్‌ ఓపెన్‌ ప్రాంగణంలో ధూమపానం అనుమతించరు. అయితే న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి వినోద ప్రయోజనాల కోసం గంజాయి వినియోగం చట్టబద్ధంగా ఉంది. సమీపంలోని ఫ్లషింగ్‌ మెడోస్‌–కరోనా పార్క్‌ ప్రాంతం నుంచి గాలి ద్వారా వాసన టెన్నిస్‌ ప్రాంగణంలోకి చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గతంలోనూ యూఎస్‌ ఓపెన్‌లో ఆటగాళ్లు ఇలాంటి వాసనపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: 9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

మూడో రౌండ్‌లోనూ విజయం..

రఖిమోవాపై విజయం సాధించిన సబలెంకా యూఎస్‌ ఓపెన్‌లో వరుసగా ఐదో ఏడాది నాలుగో రౌండ్‌కు చేరుకుంది. రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉన్న ఆమె ఈసారి వరుసగా మూడో టైటిల్‌ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగింది. మూడో రౌండ్‌ విజయం ఆ లక్ష్యంలో మరో అడుగుగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: Vaibhav Sooryavanshi: ఫైనల్ మ్యాచ్ ఆడొద్దు.. వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన గంభీర్..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us