Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలి బ్రో’.. వార్నర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌, డేవిడ్‌ వార్నర్‌.. వేర్వేరు రంగాలకు చెందిన ఈ స్టార్‌ సెలబ్రిటీల మధ్య మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ నటించిన పుష్ప సినిమాకు డేవిడ్‌ వార్నర్‌ పెద్ద అభిమాని. ఇప్పటికీ ఈ మూవీలోని పాటలు, స్టెప్పులును రీక్రియేట్‌ చేస్తుంటాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో సెంచరీల మోత మోగిస్తోన్న వార్నర్‌ మైదానంలోనూ పుష్ప స్టైల్‌లో డ్యాన్స్‌లు వేస్తున్నాడు.

Allu Arjun: 'నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలి బ్రో'.. వార్నర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన అల్లు అర్జున్‌
Allu Arjun, David Warner
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Nov 02, 2023 | 4:21 PM

అల్లు అర్జున్‌, డేవిడ్‌ వార్నర్‌.. వేర్వేరు రంగాలకు చెందిన ఈ స్టార్‌ సెలబ్రిటీల మధ్య మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ నటించిన పుష్ప సినిమాకు డేవిడ్‌ వార్నర్‌ పెద్ద అభిమాని. ఇప్పటికీ ఈ మూవీలోని పాటలు, స్టెప్పులును రీక్రియేట్‌ చేస్తుంటాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో సెంచరీల మోత మోగిస్తోన్న వార్నర్‌ మైదానంలోనూ పుష్ప స్టైల్‌లో డ్యాన్స్‌లు వేస్తున్నాడు. ఇక ఇదే పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నందుకు గానూ ఐకాన్‌ స్టార్‌ను సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపాడీ ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌. ఇక బన్నీ కూడా డేవిడ్‌ వార్నర్‌ పోస్టులకు సరదాగా రిప్లైలు, కామెంట్లు ఇస్తుంటాడు. ఇదిలా ఉంటే శుక్రవారం (అక్టోబర్‌ 27) డేవిడ్‌వార్నర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు స్టార్‌ క్రికెటర్లు డేవిడ్‌ కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ఇక బన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ వేదికగా ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల పుష్ప స్టైల్‌లో ఉన్న వార్నర్‌ ఫొటోను షేర్‌ చేసిన ఐకాన్‌ స్టార్‌ ‘ క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు. అల్లు అర్జున్‌ పోస్టుకు వెంటనే స్పందించాడు ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌. ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పుష్ప 2 షూటింగ్ లో బిజీబిజీగా అల్లు అర్జున్..

కాగా జాతీయ అవార్డును అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప 2.. ది రూల్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రెండో పార్ట్‌లో మరికొందరు స్టార్‌ సెలబ్రిటీలు నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి పేరు వినిపిస్తుండగా, బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న పుష్ప వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి
రాజకీయ నాయకురాలితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..
రాజకీయ నాయకురాలితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..
బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..!
బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..!
ఆ హీరో వద్దన్నా అక్కడ పట్టుకున్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
ఆ హీరో వద్దన్నా అక్కడ పట్టుకున్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
వామ్మో.. రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. దూసుకొచ్చిన వందేభారత్
వామ్మో.. రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. దూసుకొచ్చిన వందేభారత్
ఈ సుకుమారి స్పర్శకై ఆ వెన్నెల వేచి చేస్తోంది.. చార్మింగ్ ఇమాన్వి
ఈ సుకుమారి స్పర్శకై ఆ వెన్నెల వేచి చేస్తోంది.. చార్మింగ్ ఇమాన్వి