AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్ మరణించి రెండేళ్లు.. జీవితాలు కష్టంగా మారిపోయాయి.. శివ రాజ్ కుమార్ ఎమోషనల్..

పునీత్ మరణించి రెండేళ్లు అవుతున్నా ప్రతి క్షణం అతడిని గుర్తుచేసుకుంటున్నారు కన్నడ ప్రజలు. ఆయన ద్వితీయ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. పునీత్ సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఆయన జ్ఞాపకార్థం పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ కుమారులలో అందరికంటే చిన్నవాడు పునీత్ రాజ్ కుమార్.

Puneeth Rajkumar: పునీత్ మరణించి రెండేళ్లు.. జీవితాలు కష్టంగా మారిపోయాయి.. శివ రాజ్ కుమార్ ఎమోషనల్..
Puneeth Rajkumar
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2023 | 10:09 AM

Share

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి రెండేళ్లు. 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో ఆయన ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. తమ అభిమాన హీరో అకాల మరణాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడిగులు జీర్ణించుకోలేకపోయారు. పునీత్ మరణించి రెండేళ్లు అవుతున్నా ప్రతి క్షణం అతడిని గుర్తుచేసుకుంటున్నారు కన్నడ ప్రజలు. ఆయన ద్వితీయ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. పునీత్ సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఆయన జ్ఞాపకార్థం పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ కుమారులలో అందరికంటే చిన్నవాడు పునీత్ రాజ్ కుమార్. కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 46 ఏళ్ల వయసులోనే ఆయన అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది.

పునీత్ రెండవ వర్దంతి సందర్భంగా ఆయన అన్నయ్య శివరాజ్ కుమార్ మాట్లాడుతూ పునీత్ జ్ఞాపకాలను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. “అప్పు ఇప్పుడు లేడని అంతా అంటున్నారు. కానీ మనల్ని వదిలి పూర్తిగా ఎక్కడికి వెళ్లిపోలేదని అనిపిస్తుంది. నిత్యం మాతోనే ఉంటున్నాడు. తనను అంత త్వరగా పంపించడం నాకు ఇష్టం లేదు. తనతో ఎన్నో మంచి జ్ఞాపకాలతో.. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో.. ఎన్నో మంచి పనులలో బతికే ఉన్నాడు. తను మాతో లేకపోతే మా జీవితాలు మరింత కష్టంగా మారతాయి. పునీత్ ను మిస్ అవుతున్నాం. రెండేళ్లు గడిచిపోయాయి. మా కుటుంబంలో తనే చిన్నవాడు. అందుకే చాలా కష్టంగా ఉంది. నా కంటే 13 సంవత్సరాలు చిన్నవాడు. తను లేకుండా బ్రతకడం కష్టమే. కానీ జీవితం ముందుకు సాగాలి. నేను తనతో ఉన్న సమయాన్ని గౌరవించాలవుకుంటున్నాను అప్పుడు ఎప్పుడూ నాతోనే ఉండాలని .. తనను ఇంకా ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

అప్పు మరణించి రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో జ్ఞాపకార్థం పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అప్పు మరణించిన తర్వాత ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యి భారీ విజయాన్ని అందుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.