OTT Movies: ఓటీటీల్లోనూ రీ రిలీజ్‌ల ట్రెండ్‌.. స్ట్రీమింగ్‌కు బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

పవన్‌ కల్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రవితేజ.. ఇలా స్టార్‌ హీరోలు గతంలో నటించిన సూపర్‌ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తుండడంతో నిర్మాతలు కూడా రీ రిలీజులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే 'సినిమా రిలీజులు థియేటర్లలోనే ఉంటాయా ఏంటి? మా ఓటీటీలోనూ దింపుతున్నాం' అంటూ..

OTT Movies: ఓటీటీల్లోనూ రీ రిలీజ్‌ల ట్రెండ్‌.. స్ట్రీమింగ్‌కు బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2023 | 9:57 AM

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రవితేజ.. ఇలా స్టార్‌ హీరోలు గతంలో నటించిన సూపర్‌ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తుండడంతో నిర్మాతలు కూడా రీ రిలీజులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘సినిమా రిలీజులు థియేటర్లలోనే ఉంటాయా ఏంటి? మా ఓటీటీలోనూ దింపుతున్నాం’ అంటూ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌ ఆహా సరికొత్త ట్రెండ్‌ను స్టార్ట్‌ చేసింది. తమ ఓటీటీ వేదికగా సూపర్‌ హిట్ సినిమాలను ప్రీమియం క్వాలిటీస్‌తో రీ రిలీజ్‌ చేస్తున్నామంటూ ప్రకటించింది. మొదటి సినిమాగా అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన మగధీరను ఓటీటీలో రీ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. రామ్‌ చరణ్‌- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీని నవంబర్‌ 3న ఓటీటీలో రీ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది ఆహా.

ఇక మగధీర తర్వాత మహేశ్‌ బాబు ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్‌ సినిమా అతడును కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానున్నారు. నవంబర్‌ 10న ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఆపై నవంబర్ 17న మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’ని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ రీ రిలీజుల ట్రెండ్‌ ఇలాగే కొనసాగుతుందా? మరికొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలు డిజిటల్ రీ రిలీజ్‌కు వస్తాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

వారం గ్యాప్ లో బ్లాక్ బస్టర్ మూవీస్..

రీ రిలీజులు థియేటర్లలోనే ఉంటాయా? ఏంటి?

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న మరికొన్ని సినిమాలివే.

.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!