Renjusha Menon: మలయాళ నటి రెంజూష మీనన్‌ ఆత్మహత్య.. గంటల ముందే హ్యాపీగా రీల్ చేసిన మీనన్..

రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ'తో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Renjusha Menon: మలయాళ నటి రెంజూష మీనన్‌ ఆత్మహత్య.. గంటల ముందే హ్యాపీగా రీల్ చేసిన మీనన్..
Renjusha MenonImage Credit source: Instagram
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2023 | 5:39 PM

ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్‌ ఆత్మహత్య కేరళలో తీవ్ర సంచలనం రేపింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె శవమై కనిపించింది. ఉరి వేసుకుని రెంజూష మీనన్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ ‘స్త్రీ’తో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రెంజూషా టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ‘స్త్రీ’ సీరియల్‌తో బుల్లితెరపై మెరిసింది. ‘నిజలాట్టం,’ ‘మగలుడే అమ్మ,’ బాలామణి’ లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా ‘ఆనందరాగం’ అనే టీవీ షోలో లీడ్‌ రోల్ పాత్ర పోషించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..