Jabardasth: ‘కేసీఆర్’ సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టా.. కారు అమ్మేశా’: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్
చాలా మంది జబర్దస్త్ కమెడియన్లలాగే బిగ్ స్క్రీన్‌పై తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు రాకింగ్ రాకేశ్. తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను తీస్తున్నాడు. ఇటీవలే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్ సినిమా లాంఛ్ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాకింగ్ రాకేషే స్వయంగా నిర్మిస్తున్నారు
బజర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఒక చిన్న కంటెస్టెంట్‌గా ఈ కామెడీ షోలోకి అడుగుపెట్టిన అతను తన దైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను కడుపుడ్బా నవ్వించాడు. తన ట్యాలెంట్‌తో జబర్దస్త్ టీమ్ లీడర్‌గా కూడా ఎదిగాడు. ఇప్పుడు చాలా మంది జబర్దస్త్ కమెడియన్లలాగే బిగ్ స్క్రీన్‌పై తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు రాకింగ్ రాకేశ్. తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను తీస్తున్నాడు. ఇటీవలే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్ సినిమా లాంఛ్ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాకింగ్ రాకేషే స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా సినిమా నిర్మాణం అనేది కోట్లలో వ్యవహారం. భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఈ క్రమంలో కేసీఆర్ సినిమాపై స్పందించిన రాకింగ్ రాకేశ్ కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తానెందుకు నిర్మాతగా మారాల్సిందో చెప్పుకొచ్చాడు.
ఆ రైటర్ మోసం చేశారు..
హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీశాను. అయితే బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను సీఎం కేసీఆర్ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన నేను కట్టించిన ఇల్లును తాకట్టు పెట్టాను. దీనికి సంబంధించిన ఇంటి పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే నా కారు కూడా అమ్మేశాను. కేసీఆర్ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు నాకు మాట ఇచ్చారు. అయితే ఉన్నట్లుండి వాళ్లు నాకు హ్యాండ్ ఇచ్చారు. ఈ కారణంగానే నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది. అలాగే ఓ ప్రముఖ రచయిత మోసం చేయడం వల్ల సినిమా మొదలవ్వడానికి ముందే కారు అమ్ముకున్నాను. ఈ విషయంలో మా అమ్మతో పాటు నా భార్య సుజాత వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సుజాత అయితే డబ్బులు సరిపోకపోతే చెప్పండి నా కారు కూడా అమ్మి ఇస్తా. నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఇస్తానని నన్ను ముందుకు నడిపించింది. అలాంటి భార్య దొరకడం నా అదృష్టం’ అని ఎమోషనల్ అయ్యాడు రాకింగ్ రాకేశ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మంత్రి మల్లారెడ్డితో చేతుల మీదుగా ప్రారంభమైన కేసీఆర్ సినిమా..
View this post on Instagram
కేసీఆర్ సినిమా ప్రారంభోత్సవం..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..