AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణాలు ఇవేనా..!

బిగ్ బాస్ 7 లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు సందీప్. అలాగే నామినేషన్స్ లోనూ ఎక్కువగా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో బాగా ఆడాడు సందీప్ కానీ ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఇవే అంటూ ప్రేక్షకులు, నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

Bigg Boss 7 Telugu: సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణాలు ఇవేనా..!
Bigg Boss 7 Telugu
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2023 | 7:34 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో  మొదటి హౌస్ మెట్ గా మారి ప్రేక్షకులను మెప్పించాడు సందీప్, ఆట డాన్స్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సందీప్. ఆతర్వాత కొరియోగ్రాఫర్ గాను చేశాడు. బిగ్ బాస్ 7 లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు సందీప్. అలాగే నామినేషన్స్ లోనూ ఎక్కువగా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో బాగా ఆడాడు సందీప్ కానీ ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఇవే అంటూ ప్రేక్షకులు, నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఊహించని విధంగా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. హౌస్ లో ఉన్నవారే కాదు ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు. స్ట్రాంగ్ హౌస్ మేట్ గా ఉన్న సందీప్ టాప్ 5 లో ఉంటారని అంతా అనుకున్నారు.

కానీ ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. గత రెండు వారాలుగా సందీప్ ఆట తీరు మారింది. హౌస్ మేట్స్ తో గొడవలు, అమర్ దీప్ దగ్గర నోరు జారడాలు చేశాడు. అదే ఆయనకు మైనస్ అయ్యిందని అంటున్నారు కొందరు.  నిన్న సందీప్ ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున కూడా ఓ డైలాగ్ కొట్టారు..  ” సందీప్.. నామినేషన్స్‌లో మొదటి వారం నుంచి ఉంటే బయట ఒక ఫాలోయింగ్ వస్తుంది.. నీకిది ఫస్ట్ నామినేషన్ కదా అందుకే ఇలా” అని అన్నారు నాగ్. సందీప్ ఫ్యాన్స్ దీని తీసుకోలేకపోతున్నారు.

సీజన్ 7 లో ఇప్పటివరకు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఒక్క మెల్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కాలేదు. దాంతో నెగిటివిటి వస్తుందనుకొని సందీప్ ను బలి చేశారని అంటున్నారు అతడి ఫ్యాన్స్. శోభా శెట్టి ఈవారం హౌస్ నుంచి వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. ఆమెను బిగ్ బాస్ ఎందుకు కాపాడుతున్నాడో అర్ధంకావడం లేదు. సందీప్ మాస్టర్ శోభా కంటే చాల బెటర్ గా ఆడుతున్నారు. ఆయనను ఎలిమినేట్ చేయడం లో ఏది మతలాబ్ ఉందని అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే