Pawan Kalyan: పవర్ స్టార్ ఓజీ సినిమాలో ఒకప్పటి యాక్టర్.. కీలక పాత్రలో ఆ నటుడు
రాజకీయాల్లో బిజీగా ఉంటూ వీలు దొరికినప్పుడల్లా షూటింగ్ చేసి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. చివరగా బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్. సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.
పవర్ స్టార్ ప్-అవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పవన్ చాలా సినిమాలు కమిట్ అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ వీలు దొరికినప్పుడల్లా షూటింగ్ చేసి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. చివరగా బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్. సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ . పోస్టర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మంది నటులు నటిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఓ ఓల్డ్ హీరో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకట్. వెంకట్ హీరోగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమాలో నటించాడు. చాలా కాలంగా వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఓవెబ్ సిరీస్ లో నటించాడు.
ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. చాలా మంది ఓల్డ్ యాక్టర్స్ ఇప్పుడు విలన్స్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ సినిమా వెంకట్ కెరీర్ కు ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి. ఇక సాహో సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేక పోయిన సుజిత్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచేలా ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి తిరిగి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఓజీ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
View this post on Instagram
సుజిత్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.