Bigg Boss 7 Telugu: ‘స్ట్రాంగ్ గా బయటకొచ్చావ్’.. సందీప్ మాస్టర్‌కు గోరుముద్దలు తినిపించిన భార్య.. వీడియో
ప్రముఖ కొరియో గ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ -5 లో ఉంటాడని భావించిన సందీప్ మాస్టర్ అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటివరకు నామినేషన్స్‌లోకి రాని అనూహ్యంగా నామినేషన్స్‌లోకి రావడం, దీనికి తోడు తక్కువ ఓట్లు రావడంతో సందీప్ మాస్టర్ హౌజ్ నుంచి బయటకు రాక తప్పలేదు
బిగ్‍బాస్ తెలుగు ఏడో సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎంతో నాటకీయంగా ముగిసింది. గత ఏడు వారాలుగా మహిళా కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా.. ఫస్ట్ టైమ్ ఒక మేల్ కంటెస్టెంట్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ప్రముఖ కొరియో గ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ -5 లో ఉంటాడని భావించిన సందీప్ మాస్టర్ అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటివరకు నామినేషన్స్‌లోకి రాని అనూహ్యంగా నామినేషన్స్‌లోకి రావడం, దీనికి తోడు తక్కువ ఓట్లు రావడంతో సందీప్ మాస్టర్ హౌజ్ నుంచి బయటకు రాక తప్పలేదు. కాగా బిగ్ బాస్ హౌజ్‌లో సుమారు రెండు నెలల పాటు ఉన్నారు సందీప్ మాస్టర్. దీంతో కుటుంబ సభ్యులందరినీ మిస్ అయ్యారు. అయితే సందీప్ సతీమణి జ్యోతి రాజ్ ఎప్పటికప్పుడు తన భర్తకు అండగా నిలుస్తూ ధైర్యం చెప్పింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తన భర్తకు భరోసానిచ్చింది. ఇక విజేతగా తిరిగిరావాలంటూ హౌజ్‌కు ఒక లెటర్ కూడా రాసింది. దీనిని చదువుతూ సందీప్ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యాడు. తన భార్యను బాగా మిస్ అవుతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సందీప్ మాస్టర్‌కు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు డ్యాన్స్ మాస్టర్‌కు స్వాగతం పలికారు. ఇక ఇంట్లో సందీప్‌కు జ్యోతిరాజ్ అన్నం తినిపించారు. ముచ్చట్లు చెప్పుకుంటూ అతనికి గోరు ముద్దలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు జ్యోతి. ‘ బిగ్ బాస్ హౌజ్‌లోకి స్ట్రాంగ్‌గా వెళ్లావ్. గట్టిగా పోటీ ఇచ్చావ్. అన్ని విధాలుగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావ్. అంతే స్ట్రాంగ్ గా బయటకు వచ్చావ్. అయితే ఇది అంతం కాదు’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు జ్యోతి రాజ్. అలాగే లవ్ ఎమోజీని కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా బిగ్ బాస్‌లో ఉన్న రెండు నెలలకు గానూ సందీప్ మాస్టర్ సుమారు రూ.22. 5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
సందీప్ భార్య ఎమోషనల్ వీడియో..
View this post on Instagram
బిగ్ బాస్ హౌజ్ లో సందీప్ మాస్టర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.