Brahmamudi, October 31st episode: స్వప్నకి కడుపు లేదని తెలుసుకున్న రుద్రాణి.. టెన్షన్ లో స్వప్న!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రుద్రాణి డాక్టర్ కి కాల్ చేసి.. స్వప్నకి కడుపు లేదన్న విషయం క్లారిటీగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ నిజాన్ని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది.. ఇంత కడుపు కనిపిస్తే లేదని చెప్తున్నావేంటి అని షాక్ అవుతాడు రాహుల్. డాక్టర్ ఇచ్చింది అబార్షన్ ట్యాబ్లెట్సే.. దానికి కడుపు లేదు అందుకే అబార్షన్ కాలేదని అంటుంది రుద్రాణి. నాకు నమ్మబుద్ధి కావడం లేదు మమ్మీ.. ఇంత పెద్ద అబద్ధాన్ని స్వప్న అస్సలు దాచలేదు. దానికి అంత సీన్ లేదని రాహుల్ అంటాడు. అని మనం అనుకుంటున్నాం కాబట్టే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రుద్రాణి డాక్టర్ కి కాల్ చేసి.. స్వప్నకి కడుపు లేదన్న విషయం క్లారిటీగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ నిజాన్ని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది.. ఇంత కడుపు కనిపిస్తే లేదని చెప్తున్నావేంటి అని షాక్ అవుతాడు రాహుల్. డాక్టర్ ఇచ్చింది అబార్షన్ ట్యాబ్లెట్సే.. దానికి కడుపు లేదు అందుకే అబార్షన్ కాలేదని అంటుంది రుద్రాణి. నాకు నమ్మబుద్ధి కావడం లేదు మమ్మీ.. ఇంత పెద్ద అబద్ధాన్ని స్వప్న అస్సలు దాచలేదు. దానికి అంత సీన్ లేదని రాహుల్ అంటాడు. అని మనం అనుకుంటున్నాం కాబట్టే.. ఈజీగా అందర్నీ మోసం చేసిందని రుద్రాణి అంటుంది. ఆ కడుపును అడ్డం పెట్టుకునే అది నన్ను పెళ్లి చేసుకుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అయినా అంత ధైర్యంగా ఎలా నటిస్తుంది మమ్మీ. నువ్వు చెప్తుంటే నేనే నమ్మలేక పోతున్నా అని రాహుల్ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ప్రూఫ్స్ కోసం వెయిట్ చేస్తున్నా.. డాక్టర్ చెప్పగానే.. నిజమని తెలిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తా అని రుద్రాణి అంటుంది.
రాజ్, కావ్యల గిల్లి కజ్జాలు.. అందంగా రెడీ అయిన కావ్యని చూస్తుండిపోయిన రాజ్:
ఈలోగా నేను రెడీ అవ్వాలంటే నేను రెడీ అవ్వాలని కావ్య, రాజ్ లు ఇద్దరూ గొడవ పడతారు . ఈలోపు రాజ్ కి చక్కెలి గింతలు పెట్టి గదిలోకి వెళ్తుంది కావ్య. అన్నట్టుగానే కావ్య తొందరగా అందంగా రెడీ అవుతుంది. అందంగా రెడీ అయిన కావ్యని చూసిన రాజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక కావ్య.. రాజ్ ని ఫోటో తీయమని అడుగుతుంది. రాజ్ ఫోటోనే ఎందుకు.. ఫోనే తీసుకో అని ఇస్తాడు. అయ్యో వద్దండి.. ఒక్క ఫొటో తీయండి అని అడుగుతంది. ఇక భార్యని ఫొటో తీస్తాడు రాజ్. ఇక గది లోపలికి వచ్చిన రాజ్ ఏ డ్రెస్ వేసుకోవాలో తెలీక తికమక పెడుతూ ఉంటాడు. తల్లిదా.. పెళ్లామా అని టెన్షన్ పడతాడు. మరోవైపు కావ్య కూడా ఎవరి ఇచ్చిన డ్రెస్ వేసుకుంటారో చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది.
తను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదని షాక్ అయిన అపర్ణ.. పుల్లలు పెట్టిన రుద్రాణి:
ఆ తర్వాత స్వప్న రెడీ అయి.. కిందకు వస్తుంది. స్వప్న నాటకానికి మనం ముగింపు చెప్పలేమా అని రాహుల్ అంటే.. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా.. నిజం తెలిస్తే క్యారెమ్ బోర్డ్ లో కాయిన్స్ ని ట్రైకర్స్ డిస్టర్బ్ చేస్తే ఎలా చెల్లాచెదురు అవుతారో.. అలా చేస్తాను అని రుద్రాణి అంటుంది. స్వప్నని చూసిన ఇందిరా దేవి అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు అని అంటుంది. ఇక గది బయట రాజ్ కోసం ఎదురు చూస్తుంది కళావతి. ఇక కావ్య ఇచ్చిన డ్రెస్ వేసుకున్న రాజ్ ని చూస్తూ సంతోష పడుతుంది. వెళ్దామా అని రాజ్ అంటే.. థ్యాంక్స్ అని కావ్య చెప్తుంది. రాజ్, కావ్య ఇద్దర్నీ ఒకే కలర్ డ్రెస్ లో చూసిన అందరూ సంతోష పడతారు. కానీ అపర్ణ దేవి మాత్రం షాక్ అవుతుంది. నేను తెచ్చిన డ్రెస్ వేసుకోకుండా వస్తున్నాడేంటి? అని మనసులో అనుకుంటుంది అపర్ణ. ఇదే సమయంలో పుల్లలు పెట్టడానికి సిద్ధమవుతుంది రుద్రాణి. చూడు వదినా.. బాగా చూడు..నువ్వు తెచ్చిన డ్రెస్ పక్కకు పెట్టి భార్య తెచ్చిన డ్రెస్ వేసుకున్నాడు నీ సుపుత్రుడు. నీ కొడుకు నీ చేతుల్లోంచి చేప పిల్లలా జారి..పెళ్లాం బుట్టలో పడి పోయాడు వదినా అని పొగ పెడుతుంది రుద్రాణి. ఇక కావ్య, రాజ్ ని చూసిన అనామిక.. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచదర్ లా ఉన్నారు అని అంటుంది. థాంక్స్ చెప్తుంది కావ్య. మీ ఇద్దర్నీ చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉందని కనకం అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి స్వప్నని కూర్చోబెట్టి ఆశీర్వదిస్తారు.
స్వప్న చాలా పెద్ద నాటకం ఆడుతుందన్న డాక్టర్.. రుద్రాణికి మంచి ఛాన్స్ దొరికేసిందిగా:
ఈలోపు స్వప్నని ఆశీర్వదించడానికి రుద్రాణిని రమ్మంటే.. అప్పుడే డాక్టర్ ఫోన్ వస్తుంది.. ఫోన్ మాట్లాడుతూ వెళ్లి పోతుంది. స్వప్న చాలా పెద్ద డ్రామా ఆడుతుందని డాక్టర్ చెబుతుంది. ఇదే ఆవేశంతో వెళ్లిన రుద్రాణి.. స్వప్నని ఆశీర్వదిస్తుంది. మరోవైపు స్వప్న కూడా టెన్సన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాహుల్ ని బయటకు తీసుకెళ్లి.. నిజం చెప్తుంది రుద్రాణి. ఇది విన్న రాహుల్ ఆవేశంలో ఊగిపోతాడు. ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తాను అని అంటాడు. కానీ రుద్రాణి ఆపుతుంది. అలా చెప్తే ఆ స్వప్న ఒప్పుకోదు.. తనది నిజమైన కడుపని వాదిస్తుంది. పైగా మనల్ని ఎవరూ నమ్మరు కూడా. అదే చెప్పాల్సిన వాళ్లు చెప్తే.. మనవాళ్లే ఆ స్వప్నని ఇంట్లో నుంచి తరిమేస్తారు. డాక్టర్ ప్రియతో నిజం చెప్పేలా మనం చేస్తాం కదా.. ప్రియకి ఫోన్ చేస్తుంది రుద్రాణి. కడుపు లేకపోయినా ఉందని దొంగ రిపోర్ట్స్ ఇచ్చావ్ కదా స్పప్న.. అత్తగార్ని మాట్లాడుతున్నా.. అనగానే డాక్టర్ ప్రియ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారేంటి? మీరు ఎవరికో కాల్ చేయబోయి.. ఇంకెవరికో చేసినట్టు ఉన్నారని అంటుంది డాక్టర్ ప్రియ. మొత్తానికి డాక్టర్ని బ్లాక్ మెయిల్ చేసి.. సీమంతం ఫంక్షన్ కి తీసుకొస్తుంది రుద్రాణి. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.