Kannur Squad OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. మమ్ముట్టి క‌న్నూర్ స్క్వాడ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, కాసర్‌ గోల్డ్‌.. ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీలో రిలీజై తెలుగు ఆడియెన్స్‌ను అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన కన్నూర్‌ స్క్వాడ్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

Kannur Squad OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. మమ్ముట్టి క‌న్నూర్ స్క్వాడ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Kannur Squad Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2023 | 6:24 PM

ఓటీటీలోకి మలయాళ సినిమాలకున్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఎంతో హృద్యంగా తెరకెక్కే ఈ సినిమాలను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు లేటెస్ట్‌ మలయాళ సినిమాలతో పాటు గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌ హిట్‌ సినిమాలను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను అనుగుణంగా డబ్బింగ్‌ చేసి మరీ ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తెస్తున్నాయి. 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, కాసర్‌ గోల్డ్‌.. ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీలో రిలీజై తెలుగు ఆడియెన్స్‌ను అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన కన్నూర్‌ స్క్వాడ్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 25 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కథ ఎంతో ఎంగేజింగ్‌గా ఉండడంతో హీరో మమ్ముట్టినే స్వయంగా కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను నిర్మించడం విశేషం. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 10 నుంచి మమ్ముట్టి సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అలాగే తెలుగు వెర్షన్‌కు సంబంధించి కూడా ప్రకటన రావాల్సి ఉంది. ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని వ‌ర్గీస్ రాజ్ కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఓ బిజినెస్ మ్యాన్‌ మ‌ర్డ‌ర్ కేసును ఛేదించేందుకు క‌న్నూర్ స్క్వాడ్ అనే స్పెష‌ల్ పోలీస్ టీమ్ ఏర్పాటవుతుంది. ఈ పోలీస్‌ టీమ్‌కు హెడ్‌గా జార్జ్‌ (మమ్ముట్టి) ఉంటాడు. మరి జార్జ్‌ తన తెలివితేటలతో హంతకులను ఎలా పట్టుకున్నాడన్నదే క‌న్నూర్ స్క్వాడ్ మూవీ క‌థ‌. కాగా గతంలో కార్తీ నటించిన ఖాకీ సినిమా పోలికలు కన్నూర్‌ స్క్వాడ్‌ లో ఉన్నాయని టాక్‌ వచ్చింది. అయితే ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు మలయాళ సినిమా చరిత్రలోనే హయ్యోస్ట్‌ కలెక్షన్లు రాబట్టిన ఆరో సినిమాగా క‌న్నూర్ స్క్వాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు