Virat Kohli: సచిన్ టు కింగ్ కోహ్లీ.. పుట్టిన రోజున సెంచరీలు కొట్టిన క్రికెటర్లు వీరే..
క్రికెటర్లు అయితే తమ బర్త్ డే రోజున ఏదైనా అరుదైన ఘనత సాధించాలని కోరుకుంటారు. సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీ, అలాగే 5 వికెట్లు పడగొట్టడం లాంటి ఘనతలు అందుకోవాలనుకుంటారు. అలా తాజాగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజు (నవంబర్ 5) న ఓ అరుదైన ఘనతను అందుకున్నారు.
పుట్టిన రోజంటే ఎవరికైనా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ రోజును మరుపురానిదిగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఇక క్రికెటర్లు అయితే తమ బర్త్ డే రోజున ఏదైనా అరుదైన ఘనత సాధించాలని కోరుకుంటారు. సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీ, అలాగే 5 వికెట్లు పడగొట్టడం లాంటి ఘనతలు అందుకోవాలనుకుంటారు. అలా తాజాగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజు (నవంబర్ 5) న ఓ అరుదైన ఘనతను అందుకున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ శతకం బాదాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్ 10 ఫోర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది వన్డేల్లో విరాట్ కు 49వ సెంచరీ కావడం విశేషం. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును విరాట్ సమం చేశాడు. తద్వారా తన పుట్టిన రోజును మరింత మెమరబుల్‌గా మార్చుకున్నాడీ టీమిండియా రన్ మెషిన్. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ముందు కేవలం ఆరుగురు బ్యాటర్లు మాత్రమే తమ పుట్టినరోజున సెంచరీ కొట్టారు. వీరిలో ఇద్దరు మాత్రమే తమ పుట్టినరోజున వన్డే ప్రపంచకప్‌లో సెంచరీలు కొట్టారు. వారెవరో తెలుసుకుందాం రండి.
కోహ్లీ కన్నా ముందు ఆరుగురు మాత్రమే..
1. వినోద్ కాంబ్లీ (భారతదేశం) (21వ పుట్టినరోజు) – 100* vs ఇంగ్లాండ్, జైపూర్ (1993)
2. సచిన్ టెండూల్కర్ (భారతదేశం) (25వ పుట్టినరోజు) – 134 vs ఆస్ట్రేలియా, షార్జా (1998 )
3. సనత్ జయసూర్య (శ్రీలంక) (39వ పుట్టినరోజు) – 130 vs బంగ్లాదేశ్, కరాచీ (2008)
4. రాస్ టేలర్ (న్యూజిలాండ్) (27వ పుట్టినరోజు) – 131* vs పాకిస్తాన్, పల్లెకెలె (2011)
5.టామ్ లాథమ్ (న్యూజిలాండ్) (30వ పుట్టినరోజు) – 140* vs నెదర్లాండ్స్, హామిల్టన్ (2022)
6. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) (32వ పుట్టినరోజు) – 121 vs పాకిస్థాన్, బెంగళూరు (2023)
7. విరాట్ కోహ్లీ (భారతదేశం) (35వ పుట్టినరోజు) – 100* vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా (2023)
కఠినమైన పిచ్ పై..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ దూకుడుగా ఆడగా, గిల్ నిలకడగా ఆడాడు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పరుగుల వేగం మందగించింది. అయితే కింగ్ కోహ్లీ ఓపికగా ఆడుతూ టీమిండియా స్కోరును ముందుకు నడిపించాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూనే కష్టమైన బంతులను సింగిల్స్, డబుల్స్ తీస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ తో పాటు శ్రేయస్ అయ్యార్ (77) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..