IND vs SA: కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ.. శ్రేయస్ మెరుపులు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతాలోని చారిత్రామ్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. పుట్టిన రోజు ట్రీట్‌ను అందిస్తూ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్.. 10 ఫోర్లు) సూపర్ సెంచరీతో మెరిశాడు. తద్వారా వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డులను సమం చేశాడు
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతాలోని చారిత్రామ్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. పుట్టిన రోజు ట్రీట్‌ను అందిస్తూ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్.. 10 ఫోర్లు) సూపర్ సెంచరీతో మెరిశాడు. తద్వారా వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డులను సమం చేశాడు. విరాట్‌కు తోడుగా శ్రేయస్ అయ్యర్ ( 87 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్స్ లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్లు రోహిత్ (40), గిల్ (23) శుభారంభాన్ని అందించగా, కే ఎల్ రాహుల్ (8), సూర్య (22), జడేజా (29నాటౌట్) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, జాన్సన్, రబాడా, మహరాజ్, షంసీ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పరుగుల వేగం మందగించింది. స్పిన్నర్లకు పిచ్ బాగా సహకరించడంతో పరుగులు రాబట్టడం కష్ట మైంది. అయితే కింగ్ కోహ్లీ మాత్రం ఓపికగా ఆడుతూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ సెంచరీ పూర్తి చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ 85 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై 55 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పాకిస్థాన్‌పై కేవలం 16 పరుగులకే ఇన్నింగ్స్ ముగించిన విరాట్.. బంగ్లాదేశ్‌పై 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడి 48వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై అద్భుత ఫామ్‌ను కొనసాగించిన విరాట్ 95 పరుగులు చేసి కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీకి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై స్కోరు చేయని కోహ్లి.. శ్రీలంకపై మళ్లీ 49వ సెంచరీకి చేరువగా వచ్చి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇలా ఇదే ప్రపంచకప్‌లో కోహ్లీ రెండుసార్లు సెంచరీతో తడబడ్డాడు. కానీ దక్షిణాఫ్రికాపై కోట్లాది అభిమానుల కోరికను తీర్చాడు కోహ్లీ.
రోహిత్ మెరుపులు.. విరాట్ నిలకడ..
View this post on Instagram
ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
View this post on Instagram
వికెట్ కాపాడుకుంటూ.. నిలకడగా ఆడుతూ
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..