IND vs SA: ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ ఇచ్చేసిన కింగ్ కోహ్లీ.. సౌతాఫ్రికాపై సెంచరీతో మెరిసిన విరాట్
విరాట్ కోహ్లీ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. తన పుట్టిన రోజున అభిమానులకు మర్చిపోలేని కానుకను ఇచ్చాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు కింగ్ కోహ్లీ. సౌతాఫ్రికా బౌలర్లను నిలువరిస్తూ 118 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. తన పుట్టిన రోజున అభిమానులకు మర్చిపోలేని కానుకను ఇచ్చాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు కింగ్ కోహ్లీ. సౌతాఫ్రికా బౌలర్లను నిలువరిస్తూ 118 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి. కాగా ఈసెంచరీతో సచిన్ 49 వన్డేల రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. కాగా తన పుట్టిన రోజునే ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ నెట్టింగ తెగ సందడి చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా విరాట్ కు ఇది 78వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా విరాట్ గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీకి దగ్గరగా వచ్చి ఔటయ్యాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎంతో ఓపికగా ఆడుతూ సచిన్ సెంచరీల రికార్డును సమం చేశాడు.కాగా కోల్‌కతా పిచ్ బ్యాటింగ్‌కు అంత సులువుగా లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ మొదట్లో బాగానే బౌండరీలు బాదాడు. అయితే ఉన్నట్లుండి స్నిన్నర్లకు పిచ్ అనుకూలంగా మారిపోయింది. కేశవ్ మహరాజ్ అద్భుతమైన బంతికి శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేయడంతో విరాట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. పరుగుల వేగం కూడా బాగా తగ్గిపోయింది. అయితే అయ్యర్‌తో కలిసి కీలకమైన 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కోహ్లీ. మొదట 67 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ 119 బంతుల్లోనే తన చారిత్రాత్మక సెంచరీని అందుకున్నాడు.
విరాట్ ఏ జట్టుపై ఎన్ని సెంచరీలు చేశాడు?
- శ్రీలంకపై వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 10 సెంచరీలు చేశాడు.
- వెస్టిండీస్ -9
- ఆస్ట్రేలియా- 8
- బంగ్లాదేశ్-5
- న్యూజిలాండ్- 5
- పాకిస్థాన్- 3
- ఇంగ్లండ్-3
- జింబాబ్వే-1
సచిన్ రికార్డు సమం..
-
View this post on Instagram
కాగా విరాట్ కోహ్లి తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని కూడా ఈడెన్ గార్డెన్స్‌లో చేశాడు. ఇప్పుడు ఇదే గడ్డపై సచిన్ సెంచరీ రికార్డును సమం చేశాడు. యాదృచ్ఛికంగా, విరాట్ కోహ్లీ తన పుట్టినరోజునే సచిన్ రికార్డును సమం చేశాడు.
కఠినమైన పిచ్ పై, సౌతాఫ్రికా బౌలర్లకు ఎదురొడ్డి..
View this post on Instagram
సచిన్ సెంచరీ అభివాదం..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..