AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్‌.. శ్రీలంక క్రికెట్‌లో ముసలం.. రాజీనామాల పర్వం

ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ 2023 లో కొన్ని జట్ల ప్రదర్శన ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. అందులో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక కూడా ఉంది. టోర్నీ ఆరంభంలో బాగానే ఆడిన లంకేయులు ఆ తర్వాత వరుసగా వరుసగా 3 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌ ఆశలు కూడా సన్నగిల్లాయి

World Cup 2023: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్‌.. శ్రీలంక క్రికెట్‌లో ముసలం.. రాజీనామాల పర్వం
India Vs Sri Lanka
Basha Shek
|

Updated on: Nov 05, 2023 | 4:26 PM

Share

ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ 2023 లో కొన్ని జట్ల ప్రదర్శన ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. అందులో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక కూడా ఉంది. టోర్నీ ఆరంభంలో బాగానే ఆడిన లంకేయులు ఆ తర్వాత వరుసగా వరుసగా 3 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌ ఆశలు కూడా సన్నగిల్లాయి. మరీ ముఖ్యంగా భారత్‌ చేతిలో 55 పరుగులకు కుప్పుకూలి 302 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో శ్రీలంక క్రికెట్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ దారుణ పరాభవంపై శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్ నుంచి విరణ కోరింది. తాజాగా ఈ దారుణ ఓటమి కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ కూడా రాజీనామా చేశారు. నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత 357 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత శ్రీలంక కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా302 పరుగుల భారీ తేడాతో లంకేయులు ఓటమి పాలయ్యారు. 7 మ్యాచ్‌ల్లో శ్రీలంకకు ఇది 5వ ఓటమి కాగా, వరుసగా 3వ ఓటమి. శ్రీలంకకు అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది మూడోసారి ఆ జట్టు భారత్‌పై 100 పరుగుల కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.

భారత్‌ చేతిలో దారుణ పరాభవంతో శ్రీలంక క్రికెట్‌ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ బోర్డు, ఎంపిక కమిటీ, అధికారులపై ఆ దేశ క్రీడా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఈ ప్రదర్శనపై నివేదిక సమర్పించాలని ప్రపంచ కప్‌లో ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆదేశించారు. వీటన్నింటి మధ్య, జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా బోర్డు కార్యదర్శి మోహన్ డిసిల్వా తన పదవికి రాజీనామా చేశారు. డిసిల్వా రాజీనామాతో ఇతర బోర్డు అధికారులపై కూడా వారి పదవులను వదులుకోవాలని ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.

గాయాలతో సతమతం.. కాగా ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ముందే ఆ జట్టు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. జట్టు కెప్టెన్ దసున్ శంక కూడా గాయం కారణంగా తొలి మ్యాచ్‌ తర్వాత దూరమయ్యాడు. దీంతో లంక జట్టు బలమైన జట్ల చేతిలో ఓడిపోవడమే కాకుండా ఆఫ్ఘనిస్థాన్‌తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు లంక ప్రపంచ కప్‌లో మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ జట్లతో లంకేయులు పోరాడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే జట్టుతో పాటు బోర్డు కూడా ఊపిరి పీల్చుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..