Renu Desai: రేణూ దేశాయ్‌ మంచి మనసు.. మూగజీవాల ఆపరేషన్‌ కోసం విరాళం.. మరింత సాయం చేయాలని పిలుపు

పిల్లల కోసం సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిన రేణూ సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై దర్శనమిచ్చారు. రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వర రావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించారామె. సినిమా హిట్ కావడంతో పాటు రేణూ పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. మరి సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా? అన్నది రేణూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

Renu Desai: రేణూ దేశాయ్‌ మంచి మనసు.. మూగజీవాల ఆపరేషన్‌ కోసం విరాళం.. మరింత సాయం చేయాలని పిలుపు
Renu Desai
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2023 | 7:35 AM

మోడల్‌గా, హీరోయిన్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. సినిమా ఇండస్ట్రీలో మల్టీపుల్‌ ట్యాలెంటెండ్‌ వుమన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి బద్రి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాత పవన్‌తోనే కలిసి జానీ సినిమాలో నటించింది. ఇదే సమయంలో పవన్‌తో ప్రేమలో పడింది. ఆతర్వాత కొన్నేళ్లకు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అఖీరా, ఆద్య పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో పవన్‌, రేణూ దేశాయ్‌ విడిపోయారు. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గానే కొనసాగుతున్నారామె. కాగా పిల్లల కోసం సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిన రేణూ సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై దర్శనమిచ్చారు. రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వర రావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించారామె. సినిమా హిట్ కావడంతో పాటు రేణూ పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. మరి సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా? అన్నది రేణూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే చాలామంది సినిమా తారల్లాగే రేణూ దేశాయ్‌కి మూగ జీవాలు అంటే ప్రాణం. ఇంట్లో పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటున్నారు.

మీరూ సాయం చేయండి..

ఇటీవల సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటోన్న రేణూ దేశాయ్‌ తాజాగా ఇన్‌ స్టా గ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. కుక్కల ఆపరేషన్‌ కోసం విరాళమిచ్చిన ఆమె ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తన ఫాలోవర్లు, నెటిజన్లను అభ్యర్థించింది. కనీసం రూ.100 పంపాలని కోరింది. ‘పెంపుడు జంతువులను సంరక్షించే ఓ సంస్థ మూడు కుక్కలకు ఆపరేషన్‌ చేయించేందుకు విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుంది. నా వంతుగా రూ. 30 వేలు సర్దాను. దయచేసి మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపినా చాలు’ అని తన ఫాలోవర్లు, నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది రేణూ దేశాయ్‌. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూగ జీవాల కోసం చాలా మంచి పని చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టైగర్ నాగేశ్వర రావులో రేణూ దేశాయ్

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

పిల్లులతో రేణూ దేశాయ్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు