Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన భోలే.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్

శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు నాపేరు ఎందుకు తీస్తున్నవ్ అంటూ ఎదో చెప్పబోయాడు. ఇంతలో రతికా నువ్వు మధ్యలో దూరకు అంటూ తేజ పై రెచ్చిపోయింది రతిక. దాంతో రతికా దొరికిపోతున్నావ్ .. అడ్డంగా ప్రేక్షకులకు దొరికి పోతున్నావ్ అంటూ తేజ రివర్స్ అవ్వడంతో నోరుమూసుకుంది రతికా..

Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన భోలే.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2023 | 7:25 AM

బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ మంచి రసవత్తరం గా సాగింది. ముఖ్యంగా అమర్ దీప్ వర్సెస్ భోలే ఎపిసోడ్ హైలైట్ అనే చెప్పాలి. సోమవారం రోజు మొదలైన నామినేషన్స్ పర్వం వేడివేడిగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు నాపేరు ఎందుకు తీస్తున్నవ్ అంటూ ఎదో చెప్పబోయాడు. ఇంతలో రతికా నువ్వు మధ్యలో దూరకు అంటూ తేజ పై రెచ్చిపోయింది రతిక. దాంతో రతికా దొరికిపోతున్నావ్ .. అడ్డంగా ప్రేక్షకులకు దొరికి పోతున్నావ్ అంటూ తేజ రివర్స్ అవ్వడంతో నోరుమూసుకుంది రతికా..ఆతర్వాత మళ్లీ శోభా గురించి చెప్తూ ఎదో రీజన్ చెప్పింది. దానికి శోభా యాటిట్యూడ్ చూపించింది.

హౌస్‌లో నేను గ్రూప్ గేమ్ ఆడటానికే వచ్చాను.. షోకి ముందే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చాను.. నేను ఇలాగే ఆడతాను’ సరేనా అంటూ యాటిట్యూడ్ చూపించింది శోభా. దాంతో రతికా ముందు విను. విన్న తర్వాత మాట్లాడు.. నీకు ఏమైనా మెమొరీ లాస్ ఉందా..? అని అంది. దానికి శోభా పొగరుగా అవును నాకు మెమొరీలాస్ ఉంది అని కామెంట్స్ చేసింది. ఆతర్వాత యావర్ ను నామినేట్ చేసింది శోభా.. యావర్ సైలెంట్ గా ఉండిపోయాడు.

ఆ తర్వాత యావర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావా? లేదా? అని శోభాను అడిగాడు.. దానికి ఆడాను అను ఒప్పుకుంది శోభ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని కౌంటర్ ఇచ్చాడు యావర్. ఆతర్వాత అశ్వినిని నామినేట్ చేశాడు యావర్. దాంతో అశ్విని షాక్ అయ్యింది. నువ్వు చాలా కన్ఫ్యూజ్‌గా ఉన్నావ్..అంటూ ఎదో సిల్లీ రీజన్ చెప్పాడు యావర్. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇక అమర్ భోలేను నామినేట్ చేశాడు. గత వారం నన్ను నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు అంటూ రీజన్ చెప్పాడు. దాంతో భోలే రెచ్చిపోయాడు. “నిన్ను చూస్తే జాలేస్తుంది తమ్ముడు.. ఈ హౌస్‌‌లో ఇంత మంచి పేరు తెచ్చుకున్న నన్ను మాటలు అంటున్నావ్.. సరే నువ్వు ఈ బిగ్ బాస్‌కి వచ్చి సాధించింది ఏంటి? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్.. నిన్ను చూస్తుంటే పదేళ్ల పిల్లాడిలా ఉన్నావ్ అంటూ అమర్ పై ఫైర్ అయ్యాడు భోలే. దానికి సరే సార్ నేను బ్యాడ్ బాయ్.. మీరు గుడ్ బాయ్.. మీరు గ్రేట్ .. మీరు సూపర్.. నేనేదో పదేళ్ల పిల్లాడిని అంటూ తన స్టైల్ లో భోలే కి కౌటర్లు ఇచ్చాడు అమర్. దానికి భోలే నువ్వు బిగ్ బాస్‌కి వచ్చి.. ఆడింది ఇరగదీసింది ఏం లేదు.. కట్టెలు ఇరగ్గొట్టించుకుంటున్నావ్.. నీకంటే నేను చాలా బెటర్.. ముందు నువ్వు మారు.. జీవితంలో గెలువు.. మానసికంగా గెలువు. ఇష్టమొచ్చినట్టు అబద్దాలు మాట్లాడకు.. అంటూ ఎదో చెప్పాడు. అలాగే నవరసాలు పలికించేవాళ్లు ఇలా అబద్దాలు ఆడకూడదు అని అన్నాడు. దానికి అమర్ “మీకు మీ ప్రొఫెషన్ ఎంత గొప్పో.. మాకూ మా ప్రొఫెషన్ అంతే గొప్ప.. యాక్టింగ్ చేయడం అంత ఈజీగా కాదు.. అలా తీసిపారేయకండి” అని అన్నాడు.