బాబర్‌కు ‘అన్నీ మంచి శకునములే’.! అదే జరిగితే.. సెమీస్‌లో దాయాదుల పోరు పక్కా..

ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు 'అన్నీ మంచి శకునములే' ఎడురవుతున్నట్టు అనిపిస్తోంది. అనుకున్నట్టుగానే అన్నీ జరిగితే.. సెమీఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ ఢీకొట్టడం ఖాయంలా కనిపిస్తోంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి.. తమ సెమీస్ అవకాశాలను సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే.

బాబర్‌కు 'అన్నీ మంచి శకునములే'.! అదే జరిగితే.. సెమీస్‌లో దాయాదుల పోరు పక్కా..
Ind Vs Pak
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2023 | 7:34 PM

ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు ‘అన్నీ మంచి శకునములే’ ఎడురవుతున్నట్టు అనిపిస్తోంది. అనుకున్నట్టుగానే అన్నీ జరిగితే.. సెమీఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ ఢీకొట్టడం ఖాయంలా కనిపిస్తోంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి.. తమ సెమీస్ అవకాశాలను సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోగా.. ముంబై వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

ప్రస్తుతం నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అవే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లు. ఒక సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తలబడనుండగా.. ఇండియాను ఢీకొనే జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాబర్ అజామ్ జట్టు ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించినా.. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే.. సెమీస్ వెళ్లేందుకు న్యూజిలాండ్‌కే మెరుగైన రన్‌రేట్ లభిస్తుంది. అంటే.. పాక్ జట్టు ఇంగ్లాండ్‌తో జరగబోయే తన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది.

అంతేకాదు.. బెంగళూరులో శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కి వాతవరణం అనుకూలించే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి.. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే.. పాక్ సెమీస్‌ చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే లంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. ఇంగ్లాండ్‌ను పాకిస్తాన్ మట్టికరిపించినా.. బాబర్ అజామ్ జట్టు సెమీస్ చేరుతుంది.

మరోవైపు పాక్ సెమీస్ చేరడంలో ప్రిడిక్షన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ జట్టు విజయం సాధించిన.. తర్వాతి మ్యాచ్‌లన్నీ కూడా బాబర్ అజామ్‌కు ఫేవర్‌గానే వచ్చాయి. దాదాపుగా బాబర్ సెమీస్ చేరడానికి ‘అన్నీ మంచి శకునములే’ కనిపిస్తున్నాయ్ అన్నట్టుగా ఉంది ఆ ట్వీట్. కాగా, ఒకవేళ లక్ బాబర్‌కు ఫేవర్ చేస్తే.. కోల్‌కతా వేదికగా భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్‌లో ఢీకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వరల్డ్‌కప్ వార్తల కోసం..