IND vs AUS: హైదరాబాదీలకు మరోసారి నిరాశ.. భారత్ వర్సెస్‌ ఆసీస్‌ టీ 20 మ్యాచ్‌ ఉప్పల్‌లో లేనట్లే.. కారణమిదే

ఈనెల 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. వరల్డ్ కప్ ముగియగానే ఆసీస్‌ తో టీ 20 సిరీస్ కు భారత్ సన్నద్ధం కానుంది. ఐదు టీ20 మ్యాచుల్లో భాగంగా నవంబర్ 23న మొదటి టి20 మ్యాచ్ వైజాగ్ లో జరగనుంది. అయితే ఐదో టీ 20 డిసెంబర్ 3న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. అయితే

IND vs AUS: హైదరాబాదీలకు మరోసారి నిరాశ.. భారత్ వర్సెస్‌ ఆసీస్‌ టీ 20 మ్యాచ్‌ ఉప్పల్‌లో లేనట్లే.. కారణమిదే
India Vs Australia
Follow us
Vijay Saatha

| Edited By: Basha Shek

Updated on: Nov 08, 2023 | 6:32 PM

తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ క్రికెట్ మీద పడింది. తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ నవంబర్ 30 న ముగియనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే వరల్డ్ కప్ ముగియగానే ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. వన్డే వరల్డ్ కప్ కి ముందు టీమిండియాతో ఆస్ట్రేలియా 3 వన్డే మ్యాచ్ లు ఆడింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టీ 20 మ్యాచ్ లు నిర్వహించేందుకు రెండు బోర్డులు నిర్ణయించుకున్నాయి. దీంతో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఐదు టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. ఈనెల 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. వరల్డ్ కప్ ముగియగానే ఆసీస్‌ తో టీ 20 సిరీస్ కు భారత్ సన్నద్ధం కానుంది. ఐదు టీ20 మ్యాచుల్లో నవంబర్ 23న మొదటి టి20 మ్యాచ్ వైజాగ్ లో జరగనుంది. అయితే ఐదో టీ 20 డిసెంబర్ 3న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. అయితే అదే తేదీన తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు మొత్తం కౌంటింగ్ సెంటర్ల వద్ద బందోబస్తుగా ఉండాల్సి ఉంటుంది. దీంతో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే చివరి టీ20 మ్యాచ్ కు తాము బద్ధత కల్పించలేమని ఇప్పటికే రాచకొండ పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా బీసీసీఐ నుండి ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ పోలీసులు భద్రత కల్పించలేమని స్పష్టం చేశారు. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

అయితే గతంలోనూ కొన్ని కార్యక్రమాలు కారణంగా చెబుతూ ఉప్పల్ స్టేడియానికి పోలీసులు భద్రత కల్పించలేదు. వరల్డ్ కప్ వార్మప్‌ మ్యాచ్ ల సమయంలోనూ ఇది నిరూపితమైంది. సెప్టెంబర్ లో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లకు పోలీసులు గణేష్ నిమజ్జనాన్ని కారణంగా చూపారు. అప్పుడు ప్రేక్షకులకు అనుమతి లేకుండానే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించాల్సి వచ్చింది. ఈసారి తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ పోలీసులు కారణంగా చెబుతూ మ్యాచ్ కు భద్రత కల్పించలేమని బీసీసీఐకి లేఖ రాశారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. ఒకవేళ పోలీసుల భద్రత లేకుంటే మ్యాచ్ నునిర్వహించడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే జరిగేది భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ కాబట్టి సాధారణంగానే ప్రేక్షకుల్లో యమా క్రేజ్ ఉంటుంది. కానీ పోలీసులు ఈ మ్యాచ్ కు భద్రత కల్పించలేమని చెప్పటంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మారుస్తుందా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటుందా చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ