‘కుర్చీ మడతపెట్టి.. ప్రిడిక్షన్‌ను కొడితే..’ అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మ్యాక్సీ.. ఇద్దరూ సింహాల్లా!

వీరిద్దరూ కూడా ప్రత్యర్ధుల ముందు సింహాల్లా నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. ఇక ఓటమి ఖాయమని అభిమానులు సైతం అనుకున్నా.. ఫికర్ నై.. మీకు నేనున్నా అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.. ప్రత్యర్ధులపై సింహాల్లా ఎదురెళ్లి ఊచకోత కోశారు. కట్ చేస్తే.. తమ జట్లకు అద్భుత విజయాలను అందించారు. అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్సీ ఈ ఫీట్ సాధించారు.

'కుర్చీ మడతపెట్టి.. ప్రిడిక్షన్‌ను కొడితే..' అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మ్యాక్సీ.. ఇద్దరూ సింహాల్లా!
Virat Kohli, Maxwell
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2023 | 5:52 PM

టార్గెట్ 292, చేధనలో బ్యాటర్లు ఒక్కొక్కరూ పెవిలియన్ చేరారు. 91/7 సగానికిపైగా జట్టు ఔటైంది. వరల్డ్‌కప్‌లో ఇది చాలా కీలక మ్యాచ్. ఇందులో గెలిస్తే సరాసరి సెమీస్‌ స్పాట్ ఖాయమైనట్టే. అలాంటప్పుడు ఆ జట్టు ఒకే ఒక్కడు సింహంలా ప్రత్యర్ధులకు ఎదురెళ్లాడు. పసికూన జట్టు చేతుల్లో తలదించుకునే ఓటమి ఖాయమనుకున్న తరుణంలో.. విన్ ప్రిడిక్షన్ సైతం.. ఓడిపోతామని చెప్పిన సందర్భంలో.. ‘నీయవ్వా.. తగ్గేదేలే’ అంటూ 50.. 100.. 150.. 200.. చేధనలో డబుల్ హండ్రడ్ అందుకోవడమే కాదు.. జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. అది కూడా కండరాల నొప్పి, కాలి నొప్పితో బాధపడుతున్నా.. ఒంటి చేత్తో.. సారీ.. సారీ.. ఒంటి కాలితో నొప్పిని భరిస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. మన బిగ్ షో.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.

వరుసగా వికెట్లు పడిపోతున్నా.. ఇక ఓటమి ఖాయమని అభిమానులు సైతం అనుకున్నా.. ఫికర్ నై.. మీకు నేనున్నా అంటూ ఆస్ట్రేలియా జట్టుకు ధైర్యాన్ని ఇచ్చాడు మ్యాక్స్‌వెల్. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(12) సాయంతో మ్యాక్స్‌వెల్(201) జట్టును విజయతీరాలకు చేర్చడమే కాదు.. సెమీఫైనల్ స్పాట్‌ను కూడా ఖాయం చేశాడు.

మంగళవారం ముంబై వేదికగా ‘మ్యాడ్ మ్యాక్సీ’ ప్రత్యర్ధులను ఊచకోత కోశాడు. నిన్న ఆస్ట్రేలియా ఓడిపోతుందని 94 పర్సెంట్ ప్రిడిక్షన్ చేశారు. కానీ మ్యాక్సీ ఒకవైపు నొప్పిని భరిస్తూ.. పోరాటంలో ఆగేదేలే అన్నట్టుగా చివరికి వరకు క్రీజులో ఉంది మ్యాచ్ గెలిపించాడు. మాజీ క్రికెటర్లు మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను వన్డే క్రికెట్‌లోనే అపురూపమైనదిగా ప్రశంసలు కురిపించారు. అటు మ్యాక్స్‌వెల్‌కు కమ్మిన్స్ ఇచ్చిన సహకారం కూడా చాలా గొప్పదని చెప్పుకొచ్చారు.

ఇక సరిగ్గా ఇలాంటి ఫీట్ టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేశాడు. ఆ సమయంలో 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇండియాకు.. విన్ ప్రిడిక్షన్ ఓటమిని 85 పర్సెంట్‌గా చూపించింది. కానీ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉంది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. వీరిద్దరూ కూడా ప్రత్యర్ధుల ముందు సింహాల్లా నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ క్రమంలోనే అటు విరాట్ కోహ్లీ, ఇటు మ్యాక్స్‌వెల్‌ను ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మూవీ డైలాగ్స్‌తో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వరల్డ్‌కప్ వార్తల కోసం..