AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej- Lavanya Tripathi: ఆ ప్రముఖ ఓటీటీలో వరుణ్‌- లావణ్యల పెళ్లి వేడుక.. అసలు విషయం చెప్పేశారుగా..

ఈ మెగా పెళ్లి వేడుకకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త తెగ వైరలవుతోంది. వరుణ్‌, లావణ్యల పెళ్లి తంతు మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ భారీ ధరకు ఈ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిందని ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై వరుణ్‌ తేజ్ టీమ్‌ స్పందించింది.

Varun Tej- Lavanya Tripathi: ఆ ప్రముఖ ఓటీటీలో వరుణ్‌- లావణ్యల పెళ్లి వేడుక.. అసలు విషయం చెప్పేశారుగా..
Varun Lav Wedding
Basha Shek
|

Updated on: Nov 07, 2023 | 5:55 PM

Share

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సుమారు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటలీలోని టుస్కానీ వేదికగా పెళ్లిపీటలెక్కారు. నవంబర్‌ 1న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక పెళ్లికి రాని వారి కోసం ఆదివారం (నవంబర్‌ 5)న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుణ్‌, లావణ్యల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మెగా పెళ్లి వేడుకకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త తెగ వైరలవుతోంది. వరుణ్‌, లావణ్యల పెళ్లి తంతు మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ భారీ ధరకు ఈ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిందని ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై వరుణ్‌ తేజ్ టీమ్‌ స్పందించింది.

వరుణ్‌, లావణ్యల పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కానుందంటూ వస్తోన్న వార్తలను వరుణ్‌ తేజ్‌ టీమ్‌ ఖండించింది. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలను సృష్టించవద్దని, వ్యాప్తి చేయవద్దని కోరింది. కాగా ఓటీటీలో వరుణ్‌, లావణ్యల పెళ్లి వేడుక వస్తే చూసి ఆనందిద్దామని మెగా ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనడంతో చాలామంది నిరాశ చెందారు. గతంలో యాపిల్‌ బ్యూటీ హన్సిక పెళ్లి వేడుక మొత్తం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన సంగతి తెలిసిందే. అలాగే నయనతార- విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లి తంతు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేసేందుకు భారీ డీల్‌ కుదిరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అంతా ఒట్టిదే.. నమ్మద్దు..

లావణ్యతో వరుణ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం