AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: పాక్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్‌.. బాబర్‌ సేన సెమీస్‌ చేరాలంటే లెక్కలివే

వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఇక శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ జట్టు కూడా దాదాపు సెమీఫైనల్ ఆడటం ఖాయమైంది. కాగా శ్రీలంకపై న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయం సాధించడంతో పాక్ జట్టు సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోయాయి.

ICC World Cup 2023: పాక్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్‌.. బాబర్‌ సేన సెమీస్‌ చేరాలంటే లెక్కలివే
Pakistan Cricket Team
Basha Shek
|

Updated on: Nov 09, 2023 | 10:21 PM

Share

వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఇక శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ జట్టు కూడా దాదాపు సెమీఫైనల్ ఆడటం ఖాయమైంది. కాగా శ్రీలంకపై న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయం సాధించడంతో పాక్ జట్టు సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోయాయి. ఎందుకంటే శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి ఉంటే సెమీఫైనల్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్‌కు మంచి అవకాశం లభించేది. అయితే ఇప్పుడా ఛాన్స్‌ ఏ మాత్రం లేదు. న్యూజిలాండ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంకపై విజయంతో కివీస్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే సరిపోదు. తన నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకోవాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు నెట్ రన్ రేట్ +0.743. కానీ పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం +0.036 నెట్ రన్ రేట్ మాత్రమే కలిగి ఉంది. అంటే ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారా పాకిస్థాన్ జట్టు తమ నెట్ రన్ రేట్ +0.744 పెంచుకోవాలి.

పాకిస్తాన్‌ సెమీస్ లెక్కలివి..

  • పాక్ జట్టు ముందుగా బౌలింగ్ చేస్తే ఇంగ్లాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని కేవలం 2.4 ఓవర్లలోనే ఛేదించాలి. అంటే పాకిస్థాన్ జట్టు 284 బంతులు మిగిలి ఉండగానే ఛేజింగ్ చేసి గెలవాలి.
  • పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే 286 కంటే ఎక్కువ పరుగులు చేయాలి. ఒకవేళ 287 పరుగుల కంటే తక్కువ స్కోరు చేస్తే అధికారికంగా సెమీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది
  • ఒక వేళ పాక్ జట్టు 300 పరుగులు చేస్తే, ఇంగ్లండ్ జట్టును 13 పరుగులకే ఆలౌట్‌ చేయాలి
  • పాకిస్థాన్ 400 పరుగులు చేస్తే, ఇంగ్లండ్ ను 112 పరుగులకే పరిమితం చేయాలి
  • పాకిస్థాన్ జట్టు 450 పరుగులు చేస్తే, ఇంగ్లండ్ జట్టును 162 పరుగులకే కుప్పకూల్చాలి

అంటే పాకిస్తాన్‌ సుమారు 287 పరుగుల తేడాతో విజయం నమోదు చేయాలి. అలాగే ఇంగ్లాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని 16 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే ఈ లెక్కన పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే అన్నమాట. దీని ప్రకారం సెమీఫైనల్‌లో భారత్‌కు న్యూజిలాండ్ ప్రత్యర్థి కావడం దాదాపు ఖాయం. అలాగే మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..