AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ సూపర్బ్‌.. టాలీవుడ్‌ హీరోపై భారత క్రికెటర్‌ ప్రశంసలు

ఓటీటీలోనూ నవీన్‌ పొలిశెట్టి సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అక్టోబర్‌ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి స్ట్రీమింగ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే ఈ మూవీని చూసిన దినేష్ కార్తీక్ నవీన్‌ పొలిశెట్టి సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు

Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ సూపర్బ్‌.. టాలీవుడ్‌ హీరోపై భారత క్రికెటర్‌ ప్రశంసలు
Dinesh Karthik , Naveen Polishetty
Basha Shek
|

Updated on: Nov 09, 2023 | 9:56 PM

Share

టాలీవుడ్ యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన ఫీల్‌ గుడ్‌ సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. సెప్టెంబ‌ర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 50 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇక సినిమాలో నవీన్‌ నటనపై ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్స్‌లోనే కనిపించిన పొలిశెట్టి ఈ సినిమాలో తన నటనతో కన్నీళ్లు కూడా తెప్పించాడు. ఇక ఓటీటీలోనూ నవీన్‌ పొలిశెట్టి సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అక్టోబర్‌ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి స్ట్రీమింగ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే ఈ మూవీని చూసిన దినేష్ కార్తీక్ నవీన్‌ పొలిశెట్టి సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి రొమాన్స్ కామెడీ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. సినిమా చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంది. ఇక హీరో నవీన్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లాడు’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.

దినేశ్‌ కార్తీక్‌ పోస్టుపై హీరో న‌వీన్ పొలిశెట్టి కూడా స్పందించాడు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిపై మీరు చూపించిన ప్రేమ‌కు ధన్యవాదాలు దినేష్ కార్తీక్. ఈ వరల్డ్‌ కప్‌లో మీ కామెంటరీని ఇష్టపడుతున్నాను. లెట్స్ గో ఇండియా’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌, నవీన్‌ పొలిశెట్టిల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాకు మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌లో పవిత్రా లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, రోహిణీ, మహేష్‌, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది.

ఇవి కూడా చదవండి

దినేశ్ కార్తీక్ కామెంట్స్..

నవీన్ పొలిశెట్టి రిప్లై..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్