Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: షాకింగ్‌ ఓటింగ్‌.. అట్టడుగు స్థానంలో ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ .. రతికకు ఊహించని ప్లేస్‌

సాధారణంగా బిగ్‌ బాస్‌ నామినేషన్స్‌ రెండు రోజుల పాటు జరుగుతాయి. అయితే ఈ వారం మాత్రం కేవలం ఒకే రోజులో నామినేషన్స్‌ ప్రక్రియను ముగించాడు బిగ్‌ బాస్‌. అలా పదో వారం నామినేషన్స్‌లో మొత్తం ఐదుగురు హౌజ్‌ మేట్స్‌ నిలిచారు. పాట బిడ్డ భోలే షా వలి, హీరో శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌, గౌతమ్‌ కృష్ణలు నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు.

Bigg Boss 7 Telugu: షాకింగ్‌ ఓటింగ్‌.. అట్టడుగు స్థానంలో ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ .. రతికకు ఊహించని ప్లేస్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2023 | 9:28 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పదో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్‌ హోరా హోరీగా సాగాయి. రాజమాత కాన్సెప్టుతో సాగిన నామినేషన్స్‌ ప్రక్రియలో కంటెస్టెంట్స్‌ తమకు గిట్టని వారిని నామినేట్‌ చేశారు. సాధారణంగా బిగ్‌ బాస్‌ నామినేషన్స్‌ రెండు రోజుల పాటు జరుగుతాయి. అయితే ఈ వారం మాత్రం కేవలం ఒకే రోజులో నామినేషన్స్‌ ప్రక్రియను ముగించాడు బిగ్‌ బాస్‌. అలా పదో వారం నామినేషన్స్‌లో మొత్తం ఐదుగురు హౌజ్‌ మేట్స్‌ నిలిచారు. పాట బిడ్డ భోలే షా వలి, హీరో శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌, గౌతమ్‌ కృష్ణలు నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. ఇక వీరికి సోమవారం (నవంబర్‌ 6) రాత్రి నుంచే ఓటింగ్‌ పోల్‌ ప్రారంభమైంది.అయితే పదో వారం ఓటింగ్‌ మాత్రం షాకింగ్‌గా ఉంది. ఎప్పటిలాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ ఓటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ఇప్పటివరకు 37.62 శాతం ఓట్లు పడ్డాయి. అయితే రెండో స్థానంలో ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్‌ ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సుమారు 16.5 శాతం ఓట్లతో ఆమె సెకెండ్‌ లీడ్‌లో ఉంది. ఇక మూడో స్థానంలో సెల్ఫ్ నామినేట్ అయిన ప్రిన్స్ యావర్‌ ఉన్నాడు. అతనికి 15.43 శాతం ఓట్ల పడ్డాయి. ఇక నాలుగో స్థానంలో సింగర్‌ భోలే షావళి కొనసాగుతున్నాడు. అతనికి 15.3 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక ఆఖరి స్థానంలో నటుడు గౌతమ్‌ కృష్ణ ఉన్నాడు. అతనికి కేవలం 14. 98 శాతం ఓట్లే పడడం గమనార్హం.

అంటే ప్రస్తుతం ఓటింగ్‌ ప్రక్రియలో భోలే, గౌతమ్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వారం మొత్తం ఇదే ఓటింగ్‌ సరళి నమోదైతే మాత్రం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఒక వేళ అతనిని కాపాడాలనుకుంటే మాత్రం సింగర్‌ భోలే మాత్రం పెట్టే సర్దుకోక తప్పదు. ఇక ఏడో సీజన్‌లోకి ఫస్ట్‌ టైమ్‌ 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదో వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎలిమినేషన్స్‌ విషయానికి వస్తే.. మొదటి వారంలో కిరణ్‌ రాథోడ్‌, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామిని భట్ల, నాలుగో వారం రతికా రోజ్‌ , ఐదో వారంలో శుభశ్రీ రాయగురు, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా మూర్తి, ఎనిమిదో వారం సందీప్‌, తొమ్మిదో వారంలో టేస్టీ తేజాలు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం కూడా మేల్‌ కంటెస్టెంటే బయటకు వెళతాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్..
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్..
ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు..గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది
ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు..గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది
ఎండు ద్రాక్ష నీళ్లతో మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
ఎండు ద్రాక్ష నీళ్లతో మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి
రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి
ఇవి తింటే మీ ఒంట్లో జబ్బులన్నీ పారిపోతాయ్
ఇవి తింటే మీ ఒంట్లో జబ్బులన్నీ పారిపోతాయ్
భారత్‌తో అట్లుంటాది.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
భారత్‌తో అట్లుంటాది.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
KPHBలో దారుణం..భర్తపై విరక్తి చెంది భార్య ఏం చేసిందంటే!
KPHBలో దారుణం..భర్తపై విరక్తి చెంది భార్య ఏం చేసిందంటే!
బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యం
బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యం
ధోని డీఆర్‌ఎస్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత!
ధోని డీఆర్‌ఎస్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత!
పతంజలి మందులతో సోరియాసిస్‌కు చికిత్స.. పరిశోధనలో వెల్లడి
పతంజలి మందులతో సోరియాసిస్‌కు చికిత్స.. పరిశోధనలో వెల్లడి