Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: ‘సన్నీ.. నీ మీద రెస్పెక్ట్‌ పెరిగిపోతోంది’.. పని మనిషి కూతురు తప్పిపోతే అందాల తార ఏం చేసిందో తెలుసా?

మంచు మనోజ్‌ కరెంట్ తీగ, రాజశేఖర్‌ గరుడ వేగ, మంచు విష్ణు జిన్నా సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కూ బాగా చేరువైంది సన్నీ లియోన్. సినిమాల సంగతి పక్కన పెడితే సన్నీ లియోన్‌ను చాలామంది అభిమానించేందుకు మరో కారణం ఉంది. అదే ఆమె సామాజిక సేవ. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని మరీ పెంచుకుంటుందామె. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది సన్నీ లియోన్‌.

Sunny Leone: 'సన్నీ.. నీ మీద రెస్పెక్ట్‌ పెరిగిపోతోంది'.. పని మనిషి కూతురు తప్పిపోతే అందాల తార ఏం చేసిందో తెలుసా?
Actress Sunny Leone
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2023 | 7:31 PM

సన్నీ లియోన్.. సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార ఇప్పుడు బాలీవుడ్ తారగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. స్పెషల్‌ సాంగ్స్‌తో మెప్పించడంతో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ అలరిస్తోంది. తన అందం, అభినయంతో హిందీ సినిమాలతో పాటు దక్షిణాది మూవీస్‌లోనూ సందడి చేస్తోంది. మంచు మనోజ్‌ కరెంట్ తీగ, రాజశేఖర్‌ గరుడ వేగ, మంచు విష్ణు జిన్నా సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కూ బాగా చేరువైంది సన్నీ లియోన్. సినిమాల సంగతి పక్కన పెడితే సన్నీ లియోన్‌ను చాలామంది అభిమానించేందుకు మరో కారణం ఉంది. అదే ఆమె సామాజిక సేవ. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని మరీ పెంచుకుంటుందామె. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది సన్నీ లియోన్‌. తప్పి పోయిన బాలిక సమాచారం అందిస్తే తానే రూ. 50వేల బహుమతి ఇస్తానని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తప్పిపోయిన బాలికతో పాటు అడ్రెస్‌, ఫోన్‌ తదితర వివరాలను షేర్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. ఆయనకు అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. మంగళవారం (నవంబర్‌ 8) సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో అమ్మాయి తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ, సమాచారం చెబితే 11 వేల రూపాయలు నగదు పారితోషకం ఇస్తామని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.

అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా మరో రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్‌ ప్రకటించింది. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్‌ చేసింది. ఇలా తన వద్ద పని చేసే వ్యక్తి కుటుంబానికి వచ్చిన సమస్యను తన భుజాన వేసుకుని మరీ సాయమందిస్తోన్న సన్నీ లియోన్‌ తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ సన్నీ.. నీది చాలా మంచి మనసు.. గొప్ప మనసు.. నీ మీద రెస్పెక్ట్‌ పెంచేసుకుంటున్నావ్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

సన్నీ లియోన్ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!
ఆ ప్రమాదం ఎంతో భయంకరం.. నా కడుపు తరుక్కుపోయింది
ఆ ప్రమాదం ఎంతో భయంకరం.. నా కడుపు తరుక్కుపోయింది
ఈ పనులు చేస్తే శని దోషం తప్పదు.. లక్షణాలు, పరిహారాలు
ఈ పనులు చేస్తే శని దోషం తప్పదు.. లక్షణాలు, పరిహారాలు
స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్‌ భారత్‌లో విజయవంతమవుతుందా?
స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్‌ భారత్‌లో విజయవంతమవుతుందా?
గుడ్‌న్యూస్.. ఇక EPFO క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు కేవలం 3 రోజుల్లోనే
గుడ్‌న్యూస్.. ఇక EPFO క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు కేవలం 3 రోజుల్లోనే
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ పక్కా..!
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ పక్కా..!