Bigg Boss 7 Telugu: మరికాసేపట్లో ఓటింగ్ క్లోజ్.. పాపం.. ఆ టాప్ కంటెస్టెంట్ పెట్టె సర్దుకోవాల్సిందే..
బిగ్ బాస్ ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న ఈ సెలబ్రిటీ గేమ్ షో పదో వారం ఆఖరుకు చేరుకుంది. ఇక వీకెండ్ అంటేనే ఎలిమినేషన్ చర్చకు వస్తుంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళుతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
బిగ్ బాస్ ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న ఈ సెలబ్రిటీ గేమ్ షో పదో వారం ఆఖరుకు చేరుకుంది. ఇక వీకెండ్ అంటేనే ఎలిమినేషన్ చర్చకు వస్తుంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళుతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పైగా ఏడో సీజన్ బిగ్ బాస్ ఓటింగ్ సరళి ఎవరి ఊహలకు అందకుండా సాగుతోంది. పదో వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. ఈ వీక్‌లో మొత్తం ఐదుగురు నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. శివాజీ, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, భోలే షావలి నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. వీరికి సోమవారం రాత్రి నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 11) రాత్రితో ఓటింగ్ ముగియనుంది. అంటే మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ ఓటింగ్ క్లోజ్ కానుందన్నమాట. ఎప్పటిలాగే బిగ్ బాస్ పెద్దన్న శివాజీ ఓటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 33.85 శాతం ఓట్లు పడ్డాయి. నిన్నటి వరకు అట్టడుగు స్థానంలో ఉన్న నటుడు గౌతమ్ కృష్ణ ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. అతనికి 16.76 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక 16.67 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక పాట బిడ్డ భోలే షావళి నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. అతనికి 16.58 శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఆఖరి స్థానంలో రతికా రోజ్ ఉంది. ఆమెకు 16.13 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే ప్రస్తుతం భోలే, రతిక డేంజర్ జోన్‌లో ఉన్నారన్నమాట. అంటే ఈ వారం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఒకవేళ బిగ్ బాస్ రతికను కాపాడాలనుకుంటే మాత్రం భోలే బలికాక తప్పదు. కాగా బిగ్ బాస్‌లో రతిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో తన క్యూట్ లుక్స్‌తో బాగానే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన విచిత్ర ప్రవర్తనతో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఓటింగ్ కూడా తక్కువగా రావడంతో ఐదో వారంలోనే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే అదృష్టం కొద్దీ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే దీనిని రతిక పెద్దగా సద్వినియోగం చేసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే మళ్లీ ఆమెనే బయటకు సాగనంపేందుకు బిగ్ బాస్ రెడీ అయ్యాడనేది సమాచారం.
శివాజీ వర్సెస్ గౌతమ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..