Boys Hostel OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్‌ హిట్‌ సినిమా.. ‘బాయ్స్ హాస్టల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్టల్‌ హుదుగురు బెక‌గిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు

Boys Hostel OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్‌ హిట్‌ సినిమా.. 'బాయ్స్ హాస్టల్' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Boys Hostel Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2023 | 10:01 PM

ఇతర భాషల్లో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలు తెలుగులోకి రిలీజవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఇతర భాషా సినిమాల సందడి ఎక్కువగా ఉంది. మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అలా కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగు వెర్షన్‌లో. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్టల్‌ హుదుగురు బెక‌గిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పోషించడం విశేషం. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ మూవీకి మంచి టాక్‌ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో యూత్‌ను తెగ ఆకట్టుకున్న బాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒరిజినల్‌ వెర్షన్‌ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్‌ మాత్రం ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో శుక్రవారం (నవంబర్‌ 10) ఈ యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ స్ట్రీమింగ్ అవుతోంది.

బాయ్స్‌ హాస్టల్‌ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో క‌లిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో విడుదల చేశాయి. కాంతార, విరూపాక్ష సినిమాలకు స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక బాయ్స్ హాస్టల్‌ సినిమా కథ విషయానికి వస్తే.. హాస్టల్‌లో ఉండే అజిత్‌కు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. హాస్టల్‌ రూమ్‌మేట్స్‌కు స్టోరీని నెరేట్‌ చేస్తాడు. అయితే షార్ట్‌ఫిల్మ్‌లో చెప్పినట్లుగానే నిజంగానే వారి హాస్టల్‌ వార్డెన్ అనుమానాస్పదంగా చ‌నిపోతాడు. అతని వద్ద ఒక సూసైడ్‌ లెటర్‌ కూడా లభిస్తుంది అందులో అజిత్‌తో పాటు అతని స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. మరి వార్డెన్‌ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్‌ బాయ్స్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. వారికి ఎలాంటి అనుభవాలను ఎదురయ్యాయన్నది చక్కటి హాస్యంతో చూపించారీ బాయ్స్‌ హాస్టల్‌ సినిమాలో. మరి థియేటర్లలో ఈ సూపర్‌ హిట్ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..