Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Mohan: మరణించిన మూడో రోజున చంద్ర మోహన్‌ అంత్య క్రియలు.. సోమవారమే నిర్వహించడానికి కారణాలివే

తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రమోహన్‌ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నటుడి భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు. ఆయనను చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇక చంద్రమోహన్‌ అంత్యక్రియలపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది.

Chandra Mohan: మరణించిన మూడో రోజున చంద్ర మోహన్‌ అంత్య క్రియలు.. సోమవారమే నిర్వహించడానికి కారణాలివే
Chandra Mohan
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2023 | 7:07 PM

ప్రముఖ సీనియర్‌ నటుడు, అలనాటి హీరో చంద్రమోహన్‌ హఠాన్మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం (నవంబర్‌ 11) కన్నుమూశారు. చంద్రమోహన్‌ మరణవార్తతో టాలీవుడ్‌ తల్లడిల్లుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రమోహన్‌ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నటుడి భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు. ఆయనను చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇక చంద్రమోహన్‌ అంత్యక్రియలపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. సోమవారం (నవంబర్‌ 13) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే మరణించిన మూడో రోజున చంద్ర మోహన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు రెండు రోజుల పాటు ఆలస్యంగా జరగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. చంద్ర మోహనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఈమె ప్రస్తుతం అమెరికాలో సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. ఇక చిన్న కూతురు మాధవి చెన్నైలో సెటిల్‌ అయ్యింది. అయితే పెద్ద కూతురు మీనాక్షి తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి సమయం పడుతోందని తెలుస్తోంది. అందుకే రెండు రోజులు లేట్‌గా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీపావళి కారణంగా..

అయితే చంద్ర మోహన్‌ అంత్య క్రియలు సోమవారం నిర్వహించడానికి మరో ప్రధాన కారణం.. ఆదివారం దీపావళి పండగ ఉండడం. పండగను పెట్టుకుని అంత్యక్రియలుకు ఎవరూ వచ్చే అవకాశం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే వచ్చే ఛాన్స్‌ ఉంది. అభిమానులు కూడా చంద్ర మోహన్‌ను కడసారి చూసేందుకు రాలేరని భావించి సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారట. ఈ రెండు కారణాలతోనే చంద్ర మోహన్‌ అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ లోనే చంద్ర మోహన్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ఫిల్మ్‌ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

చిరంజీవి సంతాపం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

22 ఏళ్లుగా ఇండస్ట్రీలో క్రేజీ హీరో..
22 ఏళ్లుగా ఇండస్ట్రీలో క్రేజీ హీరో..
వెస్ట్రన్ టాయిలెట్.. ఈ విషయం తెలియకుండానే వాడేస్తున్నామా..?
వెస్ట్రన్ టాయిలెట్.. ఈ విషయం తెలియకుండానే వాడేస్తున్నామా..?
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? వెంటనే అలెర్ట్ అవ్వండి..
కుజుడి వక్ర త్యాగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
కుజుడి వక్ర త్యాగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
Optical illusion: గోవా అనుకోని గ్రీన్ ఆపిల్ ని కూడా కలిపేసారు..!
Optical illusion: గోవా అనుకోని గ్రీన్ ఆపిల్ ని కూడా కలిపేసారు..!
ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్‌..
మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్‌..
బాలయ్య డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్ పై వివాదం..ఆమె లేకపోవడంతో..
బాలయ్య డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్ పై వివాదం..ఆమె లేకపోవడంతో..
5 ఏళ్లలో డబ్బు రెట్టింపు.. రూ. లక్ష పెట్టుబడికి రూ.3.48 లక్షలు!
5 ఏళ్లలో డబ్బు రెట్టింపు.. రూ. లక్ష పెట్టుబడికి రూ.3.48 లక్షలు!
అరంగేట్రానికి పదేళ్లు..బుట్టబొమ్మ ప్రస్థానానికి క్రిటిక్స్ రివ్యూ
అరంగేట్రానికి పదేళ్లు..బుట్టబొమ్మ ప్రస్థానానికి క్రిటిక్స్ రివ్యూ