Guess The Actress: సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

సాధారణంగా సినిమాల కోసం హీరోలు సిక్స్‌ ప్యాక్‌లు, ఎయిట్‌ ప్యాక్‌లు చేస్తుంటారు. హీరోయిన్లు కూడా జిమ్‌కు, ఫిట్‌నెస్‌ సెంటర్లకు వెళుతుంటారు కానీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ మెయింటైన్‌ చేయడం అసలు సాధ్యం కాదు. అది చాలా కష్టం కూడా. అలాంటిది టాలీవుడ్‌కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్‌ సిక్స్‌ ప్యాక్‌ బ్యాడీతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. పై ఫొటో అదే.. ఇంతకీ ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా?

Guess The Actress: సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2023 | 7:00 AM

సాధారణంగా సినిమాల కోసం హీరోలు సిక్స్‌ ప్యాక్‌లు, ఎయిట్‌ ప్యాక్‌లు చేస్తుంటారు. హీరోయిన్లు కూడా జిమ్‌కు, ఫిట్‌నెస్‌ సెంటర్లకు వెళుతుంటారు కానీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ మెయింటైన్‌ చేయడం అసలు సాధ్యం కాదు. అది చాలా కష్టం కూడా. అలాంటిది టాలీవుడ్‌కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్‌ సిక్స్‌ ప్యాక్‌ బ్యాడీతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. పై ఫొటో అదే.. ఇంతకీ ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా ఈ బ్యూటీకి మంచి క్రేజ్‌ ఉంది. అన్నట్లు ఈ బ్యూటీ సినిమాల్లోకి రాక ముందు మిక్స్‌డ్‌ మార్షన్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. అలాగే ప్రొఫెషనల్ బాక్సర్‌గానూ రాణించింది. మొత్తం 20 మ్యాచులాడితే 17 లో గెలిచింది. అయితే అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్‌ నటించిన గురు సినిమాలో లేడీ బాక్సర్‌గా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌.. ఈ సిక్స్‌ ప్యాక్‌ బ్యూటీ మరెవరో కాదు రితికా సింగ్. సినిమాల్లో నటిస్తూనే మళ్లీ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ అందుకు తగ్గట్టుగా కఠినంగా కసరత్తులు చేస్తోంది. అలా తాజాగా తన సిక్స్‌ ప్యాక్‌ లుక్‌ ఫొటోస్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.

సుధా కొంగర దర్శకత్వంలో మాధవన్‌ హీరోగా నటించిన ‘సాలా ఖాదుస్’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రితికా సింగ్‌. నిజ జీవితంలో ప్రొఫెషనల్‌ బాక్సరైన రతికా ఈ సినిమాలోనూ అదే పాత్రను పోషించడం. సినిమా సూపర్‌ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పెరిగాయి. సాలా ఖదూస్‌ సినిమానే గురు పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ మూవీలోనూ రితికానే కథానాయికగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌ నటించిన కింగ్‌ ఆఫ్‌ కోల్‌కతాలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

బాక్సింగ్ ప్రాక్టీస్ లో రితికా సింగ్..

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మళ్లీ బాక్సింగ్ ఆడనుందా?

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..