- Telugu News Photo Gallery Cinema photos Sreeja Konidela Shares Cute Photo With Allu And Mega Family Children On Childrens Day
Mega Family: చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు వారసులు.. ఫొటోస్ చూశారా?
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నెహ్రూ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఇక సోషల్ మీడియాలోనూ పలువురు ప్రముఖులు తమ పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ వారికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Nov 14, 2023 | 9:36 PM

1. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నెహ్రూ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఇక సోషల్ మీడియాలోనూ పలువురు ప్రముఖులు తమ పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ వారికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో మెగా డాటర్ శ్రీజ కొణిదెల తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్బంగా పిల్లల మనస్తత్వానికి సంబంధించి ఒక నోట్ కూడా రాసుకొచ్చింది.

ఈ ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు.

కాగా 2016లో కల్యాణ్ దేవ్‌తో శ్రీజ కొణిదెల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు విడిపోయారని వార్తలు వస్తున్నా ఎవరూ అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు.

ఇక్కడ ఉన్న అన్ని చిన్న మనసులు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది శ్రీజ.





























