Tantiram OTT: భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే.. ఓటీటీలోకి వచ్చేసిన హార్రర్‌ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీల్లో మాత్రం బాగా అలరించడం ఇటీవల రివాజుగా మారింది. ముఖ్యంగా హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతున్నాయి. ఇప్పడు అలాంటి జోనర్‌కు చెందిన ఒక సినిమానే ఓటీటీలోకి వచ్చేసింది. అదే..తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. దసరాకు ముందు అక్టోబర్‌ 13న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.

Tantiram OTT: భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే.. ఓటీటీలోకి వచ్చేసిన హార్రర్‌ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Thanthiram Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 14, 2023 | 7:48 PM

థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీల్లో మాత్రం బాగా అలరించడం ఇటీవల రివాజుగా మారింది. ముఖ్యంగా హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతున్నాయి. ఇప్పడు అలాంటి జోనర్‌కు చెందిన ఒక సినిమానే ఓటీటీలోకి వచ్చేసింది. అదే..తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. దసరాకు ముందు అక్టోబర్‌ 13న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో అసలు తంతిరం సినిమా వచ్చిందనే తెలియదు చాలామందికి. దీనికి తోడు అప్పటికే టాలీవుడ్‌లో దసరా సినిమాల సందడి మొదలు కావడంతో తంతిరం సినిమా అందుకే థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే మాయమైపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తంతిరం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (నవంబర్‌ 11) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

బండి పతాకంపై శ్రీకాంత్‌ కంద్రుగుల నిర్మించిన తంతిరం సినిమాలో అవినాష్ ఎలందూరు ప్రధాన పాత్ర పోషించాడు. అజయ్ అరసాడ సంగీతం అందిస్తే, ఎస్. వంశీ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్. వంశీ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా మారిందన్న పాయింట్‌పై తంతిరం సినిమాను తెరకెక్కించారు. దీనికి సీక్వెల్‌ కూడా ఉన్నట్లు మూవీ ఎండ్‌లో హింట్‌ ఇచ్చారు మేకర్స్‌. మరి హార్రర్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఇష్టపడేవారికి తంతిరం మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఐఎమ్ డీబీ రేటింగులోనూ..

తంతిరం మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్