AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: 11 వారం ఓటింగ్‌లో దూసుకెళుతోన్న ప్రిన్స్‌ యావర్‌.. అట్టడుగున ఊహించని కంటెస్టెంట్స్‌

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి 11 వారం నామినేషన్స్‌, ఓటింగ్‌పైనే ఉంది. ఎప్పటిలాగే 11 వారం నామినేషన్స్‌ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. అయితే గత వారం కేవలం 5 గురు నామినేట్‌ కాగా ఈ వారంలో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌ జాబితాలోకి వచ్చారు.

Bigg Boss 7 Telugu: 11 వారం ఓటింగ్‌లో దూసుకెళుతోన్న ప్రిన్స్‌ యావర్‌.. అట్టడుగున ఊహించని కంటెస్టెంట్స్‌
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Nov 15, 2023 | 11:07 AM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి 11 వారం నామినేషన్స్‌, ఓటింగ్‌పైనే ఉంది. ఎప్పటిలాగే 11 వారం నామినేషన్స్‌ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. అయితే గత వారం కేవలం 5 గురు నామినేట్‌ కాగా ఈ వారంలో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌ జాబితాలోకి వచ్చారు. వీరిలో ఎక్కువగా సీరియల్‌ బ్యాచ్‌ కంటెస్టెంట్స్‌ ఉండడం గమనార్హం. మోనిత శోభావెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్ చౌదరి, రతికా రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, గౌతమ్‌ కృష్ణలు 11 వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. ఇక ఓటింగ్‌ ప్రక్రియ విషయానికొస్తే.. నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండడంతో ఓటింగ్‌ భారీగా జరుగుతోంది. ఇందులో ప్రిన్స్‌ యావర్‌కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. శివాజీ, పల్లవి ప్రశాంత్‌ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల అభిమానుల ఓట్లన్నీ యావర్‌కే పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో 11 వారం ఓటింగ్‌లో ప్రిన్స్‌ దూసుకెళుతున్నాడు. ఇక సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌ దీప్‌ చౌదరి రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం హౌజ్‌లో వీక్‌ కంటెస్టెంట్స్‌గా ఉన్న రతికా రోజ్‌, అశ్విని శ్రీ వరుసగా మూడు, నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుండడం గమనార్హం. అలాగే హౌజ్‌లో స్ట్రాంగ్‌ ప్లేయర్‌గా భావిస్తోన్న గౌతమ్‌ కృష్ణ ఓటింగ్‌లో వెనకబడిపోయాడు. ప్రస్తుతం అతను ఐదో స్థానంలో ఉన్నాడు. గౌతమ్‌తో పాటు మరో బలమైన కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి ఆరో స్థానంలో కంటిన్యూ అవుతున్నాడు. ఇక ప్రియాంక జైన్‌, శోభాశెట్టిలు వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతానికి వీరిద్దరే డేంజర్‌ జోన్‌లో ఉన్నారన్నమాట. అయితే ఓటింగ్‌ ప్రారంభమై ఇంకా ఒక్కరోజే పూర్తయిందిక. కాబట్టి కంటెస్టెంట్స్‌ ర్యాంకులు మారవచ్చు. ఒకవేళ ఓటింగ్‌ సరళి కొనసాగితే మాత్రం శోభాశెట్టి ఎలిమినేట్‌ అవ్వక తప్పదు.

ఇవి కూడా చదవండి

హౌజ్ లో ప్రిన్స్ యావర్ వర్సెస్ అమర్ దీప్..

అట్టడుగున శోభా శెట్టి..

ప్రియాంక జైన్ కూడా డేంజర్ జోన్ లోనే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us