దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతున్న నయనతార, తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆమె తన సహనటులు, ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లతో ఆమెకున్న ప్రత్యేక అనుబంధం గురించి మనసు విప్పి మాట్లాడారు. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పుకొచ్చారు.
నయనతార రవితేజతో తన స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, "రవి, నేను ఒకప్పుడు నిజంగా చాలా మంచి స్నేహితులం. అతను నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు" అని అన్నారు. వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉందని,
వారు తరచుగా హిందీలో మాట్లాడుకునేవారని ఆమె వెల్లడించారు. ఈ అసాధారణమైన అలవాటుకు కారణం రవితేజ అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద అభిమాని కావడమే అని నయనతార తెలిపారు.
రవితేజ హిందీ చాలా బాగా మాట్లాడుతారని, అతనితో పనిచేసినప్పటి నుండి వారిద్దరూ ఎప్పుడూ హిందీలోనే మాట్లాడుకునేవారమని ఆమె చెప్పారు. ఆమె కామెంట్స్ వైరలవుతున్నాయి.
ప్రస్తుతం ఇద్దరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉండటం వల్ల తరచుగా టచ్‌లో లేకపోయినా, వారి స్నేహం అలాగే ఉందని, తమ మధ్య ఎటువంటి వైరం లేదని నయనతార స్పష్టం చేశారు.
ఆమె రవితేజతో చాలా సినిమాలు చేశారని, అదంతా ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిందని అన్నారు. ఆ తర్వాత, ప్రభాస్‌తో తనకున్న అనుబంధం గురించి నయనతార ప్రస్తావించారు.
ప్రభాస్‌ను "చాలా స్వీట్‌గా ఉండే చిన్నపిల్లవాడి"తో పోల్చారు. "అతను చిన్నపిల్లవాడిలాగా అటూ ఇటూ దూకుతూ, జోకులు వేస్తూ, సరదాగా ఉండేవాడు" అని గుర్తుచేసుకున్నారు.