Bigg Boss: తోటి కంటెస్టెంట్ పై అనుచిత వ్యాఖ్యలు.. బిగ్‏బాస్ బ్యూటీపై పోలీసు కేసు నమోదు..

ఇక మరికొందరు మాత్రం తమ నోటికి పని చేప్పేస్తారు. అయితే బిగ్‏బాస్ హౌస్ లో గొడవలు తెలుగు షోలో కాస్త తక్కువే ఉంటాయి. గతంలో హిందీ బిగ్‏బాస్ షోలో గొడవలు కావడం.. కంటెస్టెంట్లను మధ్యలోనే ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కన్నడ షోలో ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‏బాస్ కన్నడ సీజన్ 10లో పాల్గొంటున్న కంటెస్టెంట్ నటి తనీషా కుప్పండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద్ ఎఫ్ఐఆర్ నమోదైంది.

Bigg Boss: తోటి కంటెస్టెంట్ పై అనుచిత వ్యాఖ్యలు.. బిగ్‏బాస్ బ్యూటీపై పోలీసు కేసు నమోదు..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 15, 2023 | 8:10 PM

ప్రస్తుతం తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ బిగ్‏బాస్ రియాల్టీ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోకు అన్ని భాషల్లోనూ టీఆర్పీ రేటింగ్ ఎక్కువగానే ఉంది. అయితే బిగ్‏బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. షోలో బూతులు మాట్లాడకూడదు.. ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు ఇలాంటి రూల్స్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కంటెస్టెంట్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక మరికొందరు మాత్రం తమ నోటికి పని చేప్పేస్తారు. అయితే బిగ్‏బాస్ హౌస్ లో గొడవలు తెలుగు షోలో కాస్త తక్కువే ఉంటాయి. గతంలో హిందీ బిగ్‏బాస్ షోలో గొడవలు కావడం.. కంటెస్టెంట్లను మధ్యలోనే ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కన్నడ షోలో ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‏బాస్ కన్నడ సీజన్ 10లో పాల్గొంటున్న కంటెస్టెంట్ నటి తనీషా కుప్పండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద్ ఎఫ్ఐఆర్ నమోదైంది.

కన్నడ బిగ్‏బాస్ సీజన్ 10కి నటుడు సుధీప్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నవంబర్ 8న ప్రసారమైన షోలో.. నటి తనీషా కుప్పండ తన తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్‏ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ బెంగళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్‌లో నటి తనీషాపై ఫిర్యాదు చేశారు. తానీషా భోవి కమ్యూనిటీని కించపరిచే విధంగా మాట్లాడారని పద్మ ఆరోపించింది. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్ పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదవడంతో, తనీషా బిగ్ బాస్ హౌస్ నుండి కొంతకాలం ఎవిక్షన్ కావడం లేదా డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘వడ్డా’ అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. ఇప్పటికే బిగ్‏బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి. గత సీజన్ లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్నీ ఉపయోగించాడు. కానీ ఆ తర్వాత అతనుడ క్షమాపణలు చెప్పాడని పద్మ గుర్తుచేశారు. ఇక బిగ్‏బాస్ సీజన్ 10 ప్రారంభంలోనే మరో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ పులి గోరు లాకెట్ ధరించినందుకు అతడిని షో మధ్యలోనే అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే