Tollywood: ‘మా బాపు బొమ్మకు పెళ్లంటా’ హీరోయిన్ ఎంతగా మారిపోయిందో చూశారా ?.. ఇప్పుడు ఆమె ఓ పొలిటిషియన్..
తెలుగులో 'మా బాపు బొమ్మకు పెళ్లంట' సినిమాతో ఫేమస్ అయ్యింది. కానీ తెలుగులో ఆమె తొలి చిత్రం రేపల్లెలో రాధ. 2001లో విడుదలైన ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది గాయత్రి. కానీ ఆమెకు పాపులారిటీని తీసుకువచ్చింది మాత్రం మా బాపు బొమ్మకు పెళ్లంట చిత్రం. 2003లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులోని 'మాటలే రాని వేళ పాట ఎలా పాడను ' సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్‍లో ఈ సాంగ్
తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయినా హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలిచిన వారి గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో గాయత్రి రాఘురామ్ ఒకరు. తెలుగులో ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ సినిమాతో ఫేమస్ అయ్యింది. కానీ తెలుగులో ఆమె తొలి చిత్రం రేపల్లెలో రాధ. 2001లో విడుదలైన ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది గాయత్రి. కానీ ఆమెకు పాపులారిటీని తీసుకువచ్చింది మాత్రం మా బాపు బొమ్మకు పెళ్లంట చిత్రం. 2003లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులోని ‘మాటలే రాని వేళ పాట ఎలా పాడను ‘ సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్‍లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంటుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆమె పలు చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమా ఎంతగా హిట్ అయినప్పటికీ తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో ఆమె తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయ్యింది.
తెలుగులో మాత్రం 2004 నుంచి 2010 వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం కథానాయికగానే కాకుండా.. సహాయకపాత్రల్లో, కొరియోగ్రాఫర్ గానూ రాణించింది. 2006లో కాలిఫోర్నియాలో యూఎస్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ దీపక్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకున్నారు. కానీ 2010లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. 2014 బీజేపీల చేరగా.. ఇటీవలే ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో గాయత్రీ రాఘురామ్ లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో ఆమె న్యూలుక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే కొన్నిసార్లు ఆమె కొత్త లుక్ పై పాజిటివ్ తోపాటు.. నెగిటివ్ కామెంట్స్ సైతం వస్తున్నాయి. 2017లో తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు గాయత్రీ. అందులో ఆమె దాదాపు 56 రోజులు ఉన్నారు. గాయత్రీ అమెరికాలో విజువల్ కమ్యూనికేషన్ లా పూర్తి చేసింది. 2014 వరకు గాయత్రి దాదాపు 100 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.