Payal Rajput: ‘అతడు నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. ఎంతో బాధపడ్డాను’.. పాయల్ రాజ్‏పుత్ ఆసక్తికర కామెంట్స్..

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటుంది పాయల్. ఇప్పుడు ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మంగళవారం. ఈ సినిమాకు డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇదే. ఇందులో నందితా శ్వేత, అజయ్ ఘోష్, దివ్యా పిల్లై కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Payal Rajput: 'అతడు నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. ఎంతో బాధపడ్డాను'.. పాయల్ రాజ్‏పుత్ ఆసక్తికర కామెంట్స్..
Payal Rajput
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2023 | 10:00 AM

డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో నెగిటివ్ రోల్ అయినా.. తన గ్లామర్ లుక్స్.. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో పాయల్ కు ఫేమ్ వచ్చినప్పిటికీ సరైన అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత ఆమె చేసిన ఏ సినిమా కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. చిన్న చిన్న సినిమాలు చూస్తూ అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటుంది పాయల్. ఇప్పుడు ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మంగళవారం. ఈ సినిమాకు డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇదే. ఇందులో నందితా శ్వేత, అజయ్ ఘోష్, దివ్యా పిల్లై కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రేమ, ఫెయిల్యూర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మంగళవారం సినిమా ప్రచారాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్.. సినిమా విశేషాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. తన ఫస్ట్ లవ్ గురించి స్పందిస్తూ.. “చదువుకునే రోజుల్లోనైనా, సినిమా పరిశ్రమలోనైనా మీ క్రష్ ఎవరు ? అని అడగ్గా.. స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించా. అతడిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగేది. నా ప్రేమను వ్యక్తం చేయగా.. అతడు నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ బాధతో చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. దాంతో పరీక్షల్లో ఫెయిలయ్యాను. ఇదే విషయం మా అమ్మకు చెప్పి ఏడ్చేశాను ” అంటూ చెప్పుకొచ్చారు పాయల్.

అలాగే మంగళవారం సినిమా షూటింగ్ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని.. జీవితంలో కష్టంగా గడిచిన క్షణాలవే అని.. లిక్విడ్ ఫుడ్ తక్కువగా తీసుకునేదాన్ని అని.. దయచేసి నీళ్లు ఎక్కువగా తాగండి అని అభిమానులకు సూచించారు పాయల్. ఇదిలా ఉంటే.. మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 11న హైదరాబాద్ లో జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.