Dhoota OTT: అఫీషియల్.. నాగ చైతన్య దూత ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్ దూత రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఆగస్టులోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారం, అప్‌డేట్స్ లేకుండా పోయాయి. దీంతో అభిమానులు దూత అప్‌డేట్స్ ఇవ్వాలని కోరారు.
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్ దూత రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఆగస్టులోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారం, అప్‌డేట్స్ లేకుండా పోయాయి. దీంతో అభిమానులు దూత అప్‌డేట్స్ ఇవ్వాలని కోరారు. దీంతో ఎట్టకేలకు దూత ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దూత అందుబాటులోకి రానుంది. ఇందులో మొత్తం ఎసిపోడ్‌లు ఉండనున్నాయని తెలుస్తోంది. దూత వెబ్ సిరీస్‌కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఒక్క ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు ఉండనుంది. గతంలో విక్రమ్- చైతూ కాంబో లో మనం, థ్యాంక్యూ వంటి ఫీల్ గుడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా దూత పేరుతో ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను మన ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రముఖ నిర్మాత శరద్ మరార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ దూత వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా దూత ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఇందులో నాగ చైతన్య కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో గొడుగు పట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు చైతూ. ఈ నయా పోస్టర్ అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా దూత వెబ్ సిరీస్ కోసం భారీ బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. 45 కోట్లకు పైగానే ఈ సిరీస్ కోసం ఖర్చు చేశారని సమాచారం.
డిసెంబర్ 1 నుంచి అధికారిక స్ట్రీమింగ్..
mystery or message? you’ll find out soon enough 👀#DhootaOnPrime streaming from Dec 1 Exclusively on @PrimeVideoIn💥@chay_akkineni @parvatweets @priya_Bshankar @ItsPrachiDesai @Vikram_K_Kumar @nseplofficial @sharrath_marar @NambuShalini #NeelimaSMarar #MikolajSygula… pic.twitter.com/qwip86QY9K
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 15, 2023
ధూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.