ఎవరక్కా నువ్వు.. మరీ ఇలా ఉన్నావ్..! పాపం మధ్యలో ఆ పాము ఏం చేసింది..

ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ పిచ్చి మొదలైంది. రీల్స్ ద్వారా డబ్బులతో పాటు పాపులారీటీ కూడా వస్తుండటంతో చాలా మంది రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. జనాలు కూడా వాటిని ఎగబడిమారి చూస్తున్నారు. ఇది ఇన్ స్టా గ్రామ్ వల్ల సినిమా అవకాశాలు అందుకున్నావారు కూడా ఉన్నారు. పలు టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలో హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

ఎవరక్కా నువ్వు.. మరీ ఇలా ఉన్నావ్..! పాపం మధ్యలో ఆ పాము ఏం చేసింది..
Funy Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2024 | 4:33 PM

జనాలకు సోషల్ మీడియా పిచ్చి రోజు రోజుకు ఎక్కువైపోతోంది. రీల్స్ చేసి పాపులర్ అవ్వాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కొందరు. ఆ మధ్య టిక్ టాక్ యాప్ వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని వింత వింత చేష్టలు చేశారు. ఇక ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ పిచ్చి మొదలైంది. రీల్స్ ద్వారా డబ్బులతో పాటు పాపులారీటీ కూడా వస్తుండటంతో చాలా మంది రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. జనాలు కూడా వాటిని ఎగబడి మారీ చూస్తున్నారు. కాగా ఇన్ స్టా గ్రామ్ వల్ల సినిమా అవకాశాలు అందుకున్నావారు కూడా ఉన్నారు. పలు టీవీ షోల్లోనూ కొందరు పాల్గొంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. తమలో ఉన్న యాక్టింగ్, డాన్స్, కామెడీ టాలెంట్ ను బయట పెడుతూ అవకాశాలు అందుకుంటున్నవారు కొందరుంటే.. మరికొంతమంది మాత్రం ఇగో ఇలా వింత వింత పనులు చేస్తున్నారు.

లైకుల పిచ్చితో కొంతమంది చేసే పనులు నవ్వులు పూయిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇన్ స్టా గ్రామ్ లో ఓ రీల్ చేసింది. ఈ రీల్ లో చేతిలో పామును పట్టుకొని సాంగ్ కు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. “ప్రేమంటే పామని బెదరాలా.. ధీమాగా తిరగర మగరాయుడా” అంటూ సాగే లిరిక్స్ కు వీడియో చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

కాగా ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాము ఎలా ఫీల్ అవుతుందో కామెంట్స్ రూపంలో పెడుతున్నారు నెటిజన్స్.. రీల్స్ పిచ్చిది అని తెలీక అనవసరంగా ఈమె కొంపలో దూరాను రా దేవుడా.. అని, అలాగే  మధ్యలో పాము ఎందుకు వచ్చింది అక్కా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది సాంగ్ లో పాము ఉంది కాబట్టి సరిపోయింది.. ఒకవేళ పులి ఉండి ఉంటే.. అని, అక్క లిరిక్స్ ను బాగా సీరియస్ గా తీసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అది డమ్మీ పాము కదా అంటున్నారు. ఏది ఏమైన ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.