AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవికి తల్లిగా, భార్యగా, అక్కగా, లవర్‏గా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Megastar Chiranjeevi: చిరంజీవికి తల్లిగా, భార్యగా, అక్కగా, లవర్‏గా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Chiranjeevi
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 26, 2024 | 12:00 PM

Share

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియనివారుండరు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి చిరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్‌ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పటివరకు దాదాపు 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ఇప్పటికీ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. అయితే దశాబ్దాల సినీప్రయాణంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరు.. ఇప్పటి జనరేషన్ హీరోయిన్లతోనూ నటిస్తున్నారు. అయితే మీకు తెలుసా.. ఓ హీరోయిన్ చిరంజీవికి అక్కగా, లవర్‌గా, తల్లిగా, భార్యగా.. ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించింది. ఆమె ఎవరో మీకు తెలుసా..? సినీరంగంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు సీనియర్ నటి సుజాత.

సుజాత.. ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమను ఏలిన హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 300కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్స్ పోషించింది. అయితే అప్పట్లో ఆమె హీరోయిన్‌గా ఆ తర్వాత అక్క, వదిన, అమ్మ వంటి పాత్రల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ప్రేమ తరంగాలు’ మూవీలో చిరంజీవికి లవర్‌గా కనిపించింది సుజాత. ఇక ఈ సినిమా చివర్లో వీరికి వివాహం జరుగుతుంది. ఆ విధంగా సుజాత చిరంజీవికి భార్యగా నటించి ఆకట్టుకుంది.

అంతేకాకుండా 1982లో ‘సీతాదేవి’ అనే సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించింది సుజాత. ఇక 1995లో ‘బిగ్‌బాస్’ మూవీలో సుజాత చిరంజీవికి తల్లిగా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. అప్పట్లో ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఇప్పటివరకు చిరంజీవికి తల్లిగా, లవర్‌గా, భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత కావడం విశేషం. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన సుజాత.. 2011, ఏప్రిల్ 6న కన్నుమూశారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.