Pushpa 2 The Rule: టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.!

Pushpa 2 The Rule: టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.!

Anil kumar poka

|

Updated on: Nov 27, 2024 | 11:10 AM

తగ్గేదే లే! ఈ ఒక్క డైలాగ్.. సౌత్ ను, నార్త్ ను ఊపేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అన్న డైలాగ్ మాస్ ను ఉర్రూతలూగించింది. దీని దెబ్బకు ఇండియా బాక్సాఫీస్ రికార్డులు షేకయ్యాయి. మాస్ ఆడియన్స్ తో థియేటర్లు దద్దరిల్లాయి. అల్లు అర్జున్ స్టైల్, యాక్షన్ సౌత్ ఆడియన్స్ కు బాగా తెలుసు. తరువాత పుష్పాతో నార్త్ కు కూడా బాగా దగ్గరయ్యారు.

అప్పటివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై బన్నీ డబ్బింగ్ సినిమాలనే చూసిన నార్త్ ఆడియన్స్.. ఫస్ట్ టైమ్.. థియేటర్లలో బన్నీ యాక్షన్ ను చూసేసరికీ.. రికార్డులను రఫ్ఫాడించేశారు. కొవిడ్ తరువాత థియేటర్లకు వెళ్లడానికి జనం భయపడుతున్న రోజులవి. అలాంటి సమయంలో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించిందీ సినిమా. నార్త్ లో ఏ హీరో ఈ స్థాయిలో చేయలేకపోయాడు. కానీ దక్షిణాది నుంచి అల్లు అర్జున్ చేయగలిగారు. అది పుష్పాతోనే సాధ్యమయ్యేసరికీ.. కలెక్షన్ల కనకవర్షం కురిసింది. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్ లో ఇదో మైలురాయి అని చెప్పాలి. ఇది పుష్పా2 సినిమాకు ఊపు తీసుకొచ్చింది. అందుకే ఏకంగా 1000 కోట్ల రూపాయిలకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేయడానికి కారణమైంది.
నిజానికి నార్త్ ఇండియాలో సినిమాలను క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. అక్కడ మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువ. పుష్ప సినిమా ఎప్పుడైతే కమర్షియల్ మసాలాతో వచ్చిందో.. అక్కడి మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అ్యయింది. ఇంకేముంది.. థియేటర్ల ముందు జాతరే. రూరల్ ఆడియన్స్ కు బాగా నచ్చేసరికీ.. అది అక్కడి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊపిరి పోసింది. పుష్ప వన్ కలెక్షన్స్ ను చూసి.. అంతకుమించిన బడ్జెట్ తో పుష్పా 2 ను తీద్దామనుకున్నారు. కాకపోతే నార్త్ లో దుమ్ము దులిపేసరికీ.. బడ్జెట్ పెరిగింది. అందుకే పుష్ప వన్ వచ్చిన నెక్స్ట్ ఇయరే.. పుష్పా టూను ప్లాన్ చేసినా.. సినిమా బాగా రావాలని ఇన్నాళ్లపాటు వెయిట్ చేశారు. పైగా నార్త్ ఆడియన్స్ ఇచ్చిన ఎనర్జీతో మేకర్స్ కూడా బడ్జెట్ లో ఎక్కడా తగ్గలేదని అర్థమవుతోంది. సినిమా సక్సెస్ అయ్యిందీ అంటే దానికి ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చినట్టే. అలా భారీ వసూళ్లు రావాలంటే.. దానికి తగ్గట్టుగా ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండాలి. దానిని రిలీజ్ వరకు మెయింటైన్ చేయాలి. పుష్పా టీమ్ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అలా ప్రేక్షకుల్లో పుష్పా క్రేజ్ పెరిగేలా చూశారు.
ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం.. ఇవన్నీ పుష్పా2పై క్యూరియాసిటీని పెంచుతూ వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 26, 2024 11:55 AM