AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ 3 అద్భుత ఆహారాలతో చెక్ పెట్టండి

Liver health: అధిక బరువు లేదా ఊబకాయం, సరిగ్గా ఆహార అలవాట్లను పాటించకపోవడం, రోజూ గంటల తరబడి కూర్చొని పనిచేయడం లాంటివి ఫ్యాటీ లివర్‌కు కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఫ్యాటీ లివర్ మొదట తక్కువ లక్షణాలతో సైలెంట్‌గా వస్తుంది.. కానీ, దీర్ఘకాలంలో లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ 3 అద్భుత ఆహారాలతో చెక్ పెట్టండి
Fatty Liver
Rajashekher G
|

Updated on: Feb 17, 2026 | 1:26 PM

Share

Fatty Liver: ఇటీవల కాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్ బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్‌కు చాలా కారణాలే ఉన్నప్పటికీ.. ప్రధానంగా.. అధిక బరువు లేదా ఊబకాయం, సరిగ్గా ఆహార అలవాట్లను పాటించకపోవడం, రోజూ గంటల తరబడి కూర్చొని పనిచేయడం లాంటివి ముఖ్యంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఫ్యాటీ లివర్ మొదట తక్కువ లక్షణాలతో సైలెంట్‌గా వస్తుంది.. కానీ దీర్ఘకాలంలో లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, లివర్ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ మూడు ప్రధాన ఆహారాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం అవసరం.

1. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ పానీయాలు

బ్లాక్ కాఫీ – లివర్‌లో ఏర్పడే ఎంజైమ్‌ల ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఫైబ్రోసిస్‌ను అడ్డుకుంటుంది.

గ్రీన్ టీ & మాచా టీ – కాటెకిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు కరిగేలా చేస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తాయి.

బ్లాక్ టీ – పాలిఫినాల్స్ అధికంగా ఉండటం వలన లివర్ కణాలను ఆక్సీకరణ, వాపు నుండి రక్షిస్తుంది. అయితే, చక్కెర, క్రీమ్ కలిపకుండా తాగాలి.

2. పసుపు (Turmeric)

పసుపులో కర్క్యుమిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. లివర్‌లో వాపును తగ్గించడంతో పాటు బైటాక్సిన్లను సులభంగా విడుదల చేస్తుంది.

రోజుకు ½ – 1 టీ స్పూన్ మోతాదులో, మిరియాల పొడి కలిపి ఆహారంలో చేర్చడం. ఉత్తమం (కూర, సూప్, స్మూతీస్, వేడి పాలు).

3. బీ గ్రూప్ ఆహారాలు: బెర్రీలు, బ్రోకలీ, బీట్ రూట్

బెర్రీలు (బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ) – ఆంథోసయనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌లో ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.

బ్రోకలీ – ఫైబర్, సుల్ఫోరాఫేన్ ఎక్కువగా ఉండటం వల్ల డిటాక్స్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది.

బీట్ రూట్ – బీటాలెయిన్స్ కలిగి ఉండి, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది, వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్తాయి.

లివర్ ఆరోగ్యానికి సాధారణ సలహాలు

రోజూ వ్యాయామం చేయాలి బరువును నియంత్రించాలి మద్యం సేవించడం మానేయాలి ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర ఎక్కువ ఉన్న ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించాలి.

బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పసుపు, బెర్రీలు, బ్రోకలీ, బీట్ రూట్‌ను ఆహారంలో తరచూ చేర్చడం ద్వారా లివర్‌లో కొవ్వు నిల్వ కాకుండా, దీర్ఘకాలంలో లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది, మెటబాలిక్ ఆరోగ్యం కూడా సరిగా ఉంటుంది. అయితే, తీవ్రమైన సమస్య ఉన్నవారు మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

Follow Us
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు