Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సంస్థలపై ఉక్కుపాదం.. ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌..

బంగ్లాదేశ్‌లో హిందూ సంస్థలపై ఉక్కుపాదం మోపడం సంచలనం రేపుతోంది. ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ప్రభును దేశద్రోహం కేసు కింద బంగ్లా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అక్టోబర్ 30న చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో ప్రధాని మోడీకి చిన్మయ్‌ప్రభును విడుదల చేసేలా చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సంస్థలపై ఉక్కుపాదం.. ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌..
Chinmay Krishna Das Detention In Bangladesh
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2024 | 7:35 AM

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఇస్కాన్ నాయకులలో ఒకరైన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఇస్కాన్ సంస్థ స్పందిస్తూ.. చిన్మయ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు ఆందోళన కలిగించే వార్తలు వచ్చాయని తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత కోసం శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంది.

“ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణం” అని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని.. ఈ ఘటనపై తగిన చర్య తీసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు చెప్పాలని కోరింది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు సోషల్ మీడియాలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఇస్కాన్ సంస్థ చేసిన పోస్ట్ ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు. బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు.

పోలీసుల సూచనల మేరకు చిన్మయ్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రతినిధి తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం చిన్మయ్ కృష్ణ దాస్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అప్పగించనున్నారు. అయితే చిన్మయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్ చేయడంపై బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దీనిని ఖండించింది. ఈ చర్యలతో ప్రపంచంలో బంగ్లాదేశ్ ప్రతిష్ట మసకబారుతుందని కౌన్సిల్ పేర్కొంది. దాస్ చిట్టగాంగ్ వెళ్లాల్సి వచ్చిందని సనాతని జాగరణ్ జోట్ చీఫ్ ఆర్గనైజర్ తెలిపారు.

బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంలో ఆగ్రహం

అక్టోబర్ 30న చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మరోవైపు చిన్మయ్ దాస్‌పై తీసుకున్న ఈ చర్యపై బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిట్టగాంగ్‌లోని చెరగి పహాడ్ కూడలి వద్ద వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..