AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Effect: ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు

దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నెల ఈ నెల 29న జరగనున్న ప్రధాని మోడీ పర్యటన రద్దు చేశారు.

Cyclone Effect: ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
Modi Visakhapatnam Trip Cancelled
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 9:11 AM

Share

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు – శ్రీలంక తీరాల వైపు వాయుగుండం వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకూ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.

ఈ నెల 26 నుంచి 28 వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. అటు, దక్షిణ కోస్తాంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. కోతలు చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా… ఇప్పుడా పర్యటన రద్దయింది. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ప్రధాని పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు పీఎంవో వెల్లడించింది. ప్రధాని తన పర్యటనలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన చేయడంతో పాటు, పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. ఈ సభ నుంచే ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ప్రధాని సభ కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పీఎంవో సమాచారంతో ఈ పనులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..