AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి నిధులు జమ!

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి నిధులు జమ!
Telangana Gram Panchayats
Anand T
|

Updated on: Feb 17, 2026 | 6:29 PM

Share

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో మంగళవారం ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఇటీవలే రెండో విడతగా రూ. 387 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గాను, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలకు గాను, రహదారులను పునరుద్దరించేందుకు, కొత్త రోడ్లను నిర్మించేందుకు ఉపయోగించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం కింద ఇంకా రాష్ట్రానికి సుమారు రూ. 3000 కోట్లు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేయనున్నట్టు పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..