AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దోమల నివారణకు డ్రోన్ .. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించిన సర్పంచ్

పొన్నూరు మండలం గోళ్లమూడి పాడు గ్రామం. చాలా చిన్న గ్రామమే అయినప్పటికీ ఆ గ్రామానికి పెద్ద చెరువు ఉంది. పదమూడు ఎకరాల్లో ఆ చెరువు విస్తరించి ఉంది. అంతేకాదు చెరువు మొత్తం తూటికాడ, తామర పువ్వు ఆకు వ్యాపించి ఉంది. నీరు కూడా మురికిగా మారడంతో చెరువు చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. అంతేకాకుండా ఆ దోమలు గ్రామంలో స్వైర్య విహారం చేస్తూ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి

Viral Video: దోమల నివారణకు డ్రోన్ .. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించిన సర్పంచ్
Drones Used in Mosquito Control
T Nagaraju
| Edited By: |

Updated on: Jan 30, 2024 | 12:23 PM

Share

ఆధునిక టెక్నాలజీలో భాగమైపోయింది డ్రోన్.. కూలీలతో చేయించే అనేక పనుల కోసం ఇప్పుడే డ్రోన్ నే ఉపయోగిస్తున్నారు. మొదట కెమెరాతో ఉన్న డ్రోన్ లు ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున డ్రోన్ లను ఉపయోగించడం మొదలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనకు చేస్తున్న సమయంలో కెమెరా డ్రోన్ ద్వారా పోలీసులు నిఘా పెడుతున్నారు. అటు తర్వాత వ్యవసాయ రంగంలోకి డ్రోన్ లు దూకేసాయి.

పురుగు మందలు పిచికారీలో డ్రోన్ లు విరివిగా ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, రిసెర్చ్ సెంటర్లు వీటిని తయారు చేసి రైతులకు అందిస్తున్నాయి. అయితే తాము ఎదుర్కొంటున్న వింత సమస్యకు డ్రోన్ మాత్రమే పరిష్కారం చూపించగలదన్న నిర్ణయానికి వచ్చిన ఆ గ్రామ మొదటి పౌరురాలు మొత్తానికి డ్రోన్ ను ఉపయోగించింది. వివరాల్లోకి వెళితే…

పొన్నూరు మండలం గోళ్లమూడి పాడు గ్రామం. చాలా చిన్న గ్రామమే అయినప్పటికీ ఆ గ్రామానికి పెద్ద చెరువు ఉంది. పదమూడు ఎకరాల్లో ఆ చెరువు విస్తరించి ఉంది. అంతేకాదు చెరువు మొత్తం తూటికాడ, తామర పువ్వు ఆకు వ్యాపించి ఉంది. నీరు కూడా మురికిగా మారడంతో చెరువు చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. అంతేకాకుండా ఆ దోమలు గ్రామంలో స్వైర్య విహారం చేస్తూ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో దోమల బెడద తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థలు సర్పంచ్ రాజ్యలక్ష్మీకి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే సర్పంచ్ పారిశుద్య కార్మికుల చేత దోమల మందు కొట్టించాలని చూసినా వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. చెరువలో అధికంగా నీరుండటంతో పాటు తూటికాడ సమస్యతో ఎవరూ చెరువులోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. తమ సమీప గ్రామంలోని రవి కుమార్ అనే రైతు వద్ద వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ఉందని తెలుసుకున్నారు. అతని వద్ద నుండి డ్రోన్ తీసుకొని వచ్చారు. పదమూడు ఎకరాల చెరువులో దోమల మందు పిచికారీ చేయడానికి డ్రోన్ ను ఉపయోగించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి చెరువుతో పాటు చెరువు చుట్టు పక్కల దోమల మందును పిచికారీ చేయించారు. ఒక్కసారి పదిహేను లీటర్ల నీటిని డ్రోన్ మోసుకొని వెలుతుందని సర్పంచ్ రాజ్యలక్ష్మీ తెలిపారు. డ్రోన్ ఉండటంతో సులభంగానే దోమల మందు పిచికారీ చేసినట్లు ఆమె చెప్పారు.

మొత్తం ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రామంలో దోమల బెడద నివారిండంతో సర్పంచ్ పై ప్రసంశల జల్లు కురుస్తుంది. గ్రామస్ధులు కూడా సంతోసం వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడద ఎక్కువుగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాత్రుల్లో నిద్ర కూడా సరిగా ఉండటం లేదన్న స్థానికులు ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉన్నారు. దోమల నివారణకు డ్రోన్ ను ఉపయోగించిన సర్పంచ్ ను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..