Andhra Pradesh: సిద్ధం.. మేము సిద్ధమే.. బెజవాడ సెంటర్‌లో సవాల్.. తగ్గేదేలే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జరగనున్నాయి. దీంతో అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఇతర పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజా పాలనలో తమ మార్క్ ఏంటో వివరిస్తున్నాయి పార్టీలు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో పోస్టర్ వార్ షురూ అయింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జరగనున్నాయి. దీంతో అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఇతర పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజా పాలనలో తమ మార్క్ ఏంటో వివరిస్తున్నాయి పార్టీలు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో పోస్టర్ వార్ షురూ అయింది. బెజవాడలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఇరు పార్టీలు ఫ్లెక్సీలతో పోటాపోటీ క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన ఫెక్సీలను ఏపీలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసింది.
సిద్ధం.. అని వైసీపీ ప్రచారం చేస్తుండగా.. మేము సిద్ధమే అంటూ జనసేన రంగంలోకి దిగింది. విజయవాడ సెంటర్లో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధ ఫెక్సీల వద్ద.. పోటీగా జనసేన పోస్టర్లను ఏర్పాటు చేసింది. మేము సిద్ధమంటూ బెజవాడలోని పలు కూడళ్లలో జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి.
వీడియో చూడండి..
అయితే, ఫ్లెక్సీల వార్.. అటు జనంలో ఇటు రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పరిస్థితి ఇలా ఉందంటే.. మున్ముందు రాజకీయ వేడి ఎలా ఉంటుందోనంటూ చర్చ మొదలైంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..