Valentine’s Day: ప్రేమికుల రోజుని జీవితాంతం గుర్తుంచుకునేలా మీ భాగస్వామితో ప్రేమగా జరుపుకోవాలా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..
ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జంటలకు చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ వారం రోజులను వాలెంటైన్ వీక్‌గా జరుపుకుంటారు. మారుతున్న కాలంలో వివిధ రకాల సదుపాయాలు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఈ వారం రోజులు ఒకొక్క రోజుని ఒకొక్క విధంగా జంటలు పరస్పరం తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. మీరు వాలెంటెన్ డేని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మీ భాగస్వామితో గడపాలని ప్లాన్ చేస్తుంటే.. మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తుంటే.. ప్రేమికుల రోజున ప్రేమగా మీ భాగస్వామితో గడపడం కోసం దేశంలోని ఐదు ఉత్తమ స్థలాలు బెస్ట్ ఎంపిక.
ఫిబ్రవరి నెల వస్తుందంటే చాలు ప్రేమికుల్లో ఎంతో సంతోషం. వారం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. అందుకనే ఫిబ్రవరి నెలను ప్రేమ నెల అంటారు. ప్రతి ఒక్కరూ ఈ నెలలో ముఖ్యంగా లవర్స్ డేని జరుపుకోవడానికి తమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జంటలకు చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ వారం రోజులను వాలెంటైన్ వీక్‌గా జరుపుకుంటారు. మారుతున్న కాలంలో వివిధ రకాల సదుపాయాలు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఈ వారం రోజులు ఒకొక్క రోజుని ఒకొక్క విధంగా జంటలు పరస్పరం తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. మీరు వాలెంటెన్ డేని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మీ భాగస్వామితో గడపాలని ప్లాన్ చేస్తుంటే.. మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తుంటే.. ప్రేమికుల రోజున ప్రేమగా మీ భాగస్వామితో గడపడం కోసం దేశంలోని ఐదు ఉత్తమ స్థలాలు బెస్ట్ ఎంపిక. ఇక్కడ మీ ప్రేమ యాత్రను అత్యంత ఆనందంగా గడప వచ్చు.
ఊటీ : ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, కొండ కోనలు.. ఆకట్టుకునే అందం కారణంగా ప్రేమికుల రోజున గడపడానికి జంటలకు ఉత్తమ ప్రదేశం. ఈ ప్రశాంతమైన హిల్ స్టేషన్ వద్ద చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఊటీలో టాయ్ రైలులో ప్రయాణించవచ్చు. మెట్టుపాళయం నుండి రైలులో ఊటీకి వెళ్ళవచ్చు. ఈ రైలు మిమ్మల్ని కొండల మీదుగా వంకరగా తీసుకెళ్తు సరికొత్త అనుభూతులను ఇస్తుంది.
ఆగ్రా : శృంగార ప్రదేశాల జాబితాలో ఆగ్రా చేర్చబడింది. వాలెంటైన్స్ డే సందర్భంగా సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఆగ్రా ఒకటి. ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఆస్వాదించవచ్చు. తాజ్ మహల్ వద్ద ఫోటోలను అందంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడకు ప్రేమికుల రోజున వెళ్లాలంటే ముందుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రేమికుల రోజున ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది.
సిమ్లా : యంగ్ కపుల్ కి లేదా కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ కు వెళ్లేందుకు బెస్ట్ ఎంపిక సిమ్లా. కపుల్స్ ఎక్కువగా సందర్శించే సిమ్లా భారతదేశంలోని అత్యంత శృంగార నగరాలలో ఒకటి ఇక్కడ మీ భాగస్వామితో కలిసి ఐస్ స్కేటింగ్, షాపింగ్, రొమాంటిక్ డిన్నర్‌లను ఆస్వాదించవచ్చు. మీరు కారులో ఢిల్లీ నుండి సిమ్లాకు సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి వోల్వోను కూడా బుక్ చేసుకోవచ్చు.
ముస్సోరీ : క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలవబడే ముస్సోరీని భాగస్వామితో కలిసి సందర్శించడానికి గొప్ప ప్రదేశంగా చెప్పవచ్చు. ప్రేమికుల రోజున ముస్సోరీలోని అందమైన లోయలను సందర్శించండి. అందమైన పర్వతాలు, సరస్సులు, జలపాతాలు, మనసుకు హాయినిచ్చే ప్రకృతి దృశ్యాలు మీ యాత్రను జీవితంలో గుర్తుండిపోయేలా చేస్తాయి. ఇక్కడ కెంప్టీ ఫాల్స్, గన్ హిల్స్, భట్ ఫాల్స్ , లాల్ టిబ్బా వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు. రైలులో ఢిల్లీ నుండి ముస్సోరీకి వెళ్ళవచ్చు. డెహ్రాడూన్ స్టేషన్‌లో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా ముస్సోరీకి చేరుకోవచ్చు.
లాన్స్‌డౌన్: ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన, శృంగారభరితమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం జంటలు సంతోషముగా గడపడానికి బెస్ట్ ఎంపిక. ఎత్తైన పర్వతాలు, అందమైన దృశ్యాలు, సరస్సులు, జలపాతాల మధ్య వాలెంటైన్ డేను ఎంతో అందంగా జరుపుకోవచ్చు. సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కోట్‌ద్వార్ రైల్వే స్టేషన్ రైలులో ఇక్కడికి చేరుకోవచ్చు. అనంతరం ఇక్కడ నుండి టాక్సీ తీసుకుని లాన్స్‌డౌన్ చేరుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..