Ramayanam: తాళ పత్రాలపై రామాయణం.. నేటి జనరేషన్ కోసం ఏడు కాండలను క్లుప్తంగా లిఖించిన భక్తుడు
తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయిన తరుణంలో తాళపత్రాల మీద మరోసారి రామాయణం లిఖించాడు ఓ భక్తుడు. వాల్మీకి ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా తాళ పత్రాలపై రామాయణం రాసి ప్రత్యేకత చాటుకున్నారు. ఎంతో నియమనిష్ఠతో రామాయణంలోని ఏడు కాండలను తాళ పత్రాలపై లిఖించి హౌరా అనిపించుకుంటున్నారు తెలంగాణ కు చెందిన రామయ్య భక్తుడు బొమ్మరత ఎల్లయ్య.
వాల్మీకి లిఖించిన అది కావ్యం రామాయణం మనుగడలో ఉన్న గొప్ప కావ్యం. మనిషి జీవన శైలికి, కలియుగంలో మానవ ఆలోచనలకు దగ్గర ఉన్న రామాయణ ఘట్టాలు ఎంతో గొప్పవి. అంతటి గొప్ప కావ్యాన్ని తాళ పత్రాలపై లిఖించి తన భక్తిని చాటుకున్నారు మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే భక్తుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే రచయిత సింగరేణి కాలరీస్ లో విధులు నిర్వహించేవారు. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన చిరకాల కోరిక అయిన రామాయణ రచనపై దృష్టి సారించారు.
తాళ పత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటినీ రామాయణం రాసుకునే విధంగా సిద్దం చేసుకొని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రచయితగా మంచి పేరు ఉన్న యల్లయ్య తన రచనలు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో నిష్ఠతో తాళ పత్రాలపై రామాయణాన్ని లిఖించి రాముడిపై తన భక్తిని చాటుకున్నారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం వాల్మీకి రాసిన రామాయణాన్ని మళ్లీ తను అదే తాళ పత్రాలపై లిఖించడం.. ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడం తన అదృష్టమని.. తన జన్మ ధన్యం అయిందని ఏలయ్య భక్తి పారవశ్యంతో పరవశించి పోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..